Supreme Court : టీటీడీ బోర్డును రద్దు చేయాలన్న పిటిషన్ కొట్టివేత
ABN , Publish Date - Feb 08 , 2025 | 04:29 AM
టీటీడీ) బోర్డును రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

కావాలంటే హైకోర్టుకు వెళ్లాలని పిటిషనర్‌కు సుప్రీం సూచన
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): తిరుమల తిరుపతి దేవస్థానాల(టీటీడీ) బోర్డును రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. గత నెల 8న తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల పంపిణీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందిన ఘటనకు సంబంధించి ప్రస్తుత బోర్డును రద్దు చేసి కొత్త బోర్డును నియమించాలని కోరుతూ భా రత చైతన్య యువజన పార్టీ(బీసీవైపీ) అధ్యక్షుడు బోడే రామచంద్రయాదవ్ గత నెల 17న రిట్ పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యం శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్‌తో కూడిన ధర్మాసనం ముందుకు రాగా.. విచారణ జరిపేందుకు నిరాకరించింది. రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్‌కు సూచిస్తూ వ్యాజ్యాన్ని కొట్టివేసింది.
ఈ వార్తలు కూడా చదవండి:
NTR District: మరో వివాదంలో చిక్కుకున్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు..
Cabinet Decisions: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్‍కు ఆమోదం