High Court Judges Transfers: దేశవ్యాప్తంగా 14 మంది హైకోర్టు జడ్జిల బదిలీ..
ABN , Publish Date - Aug 25 , 2025 | 08:30 PM
దేశ వ్యాప్తంగా 14 మంది హైకోర్టు జడ్జీలను బదిలీ చేసింది సుప్రీంకోర్టు కొలీజియం. ఏపీ హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తులను బదిలీ చేసింది. గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాన్వేంద్రనాథాయ్‌ను ఏపీ హైకోర్టుకు బదిలీ చేశారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 25: దేశ వ్యాప్తంగా 14 మంది హైకోర్టు జడ్జీలను బదిలీ చేసింది సుప్రీంకోర్టు కొలీజియం. ఏపీ హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తులను బదిలీ చేసింది. గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాన్వేంద్రనాథాయ్‌ను ఏపీ హైకోర్టుకు బదిలీ చేశారు. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీ. రమేష్‌ను ఏపీ హైకోర్టుకు బదిలీ చేశారు. కోల్‌కతా హైకోర్టు న్యాయమర్తి జస్టిస్ సుబేందు సమంతను కూడా ఏపీ హైకోర్టుకు బదిలీ. ఈ ముగ్గురు న్యాయమూర్తులను ఏపీ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. వీరితో పాటు దేశ వ్యాప్తంగా మరో 11 మంది న్యాయమూర్తులను వివిధ రాష్ట్రాలకు బదిలీ చేసింది సుప్రీంకోర్టు కొలీజియం.