మధుసూదన్ కుటుంబానికి అండగా ఉంటాం: మంత్రి కందుల
ABN , Publish Date - Jun 07 , 2025 | 05:11 AM
పహల్గాం ఉగ్రదాడుల్లో మృతి చెందిన నెల్లూరు జిల్లా కావలికి చెందిన సోమిశెట్టి మధుసూదనరావు కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు.
పవన్ ప్రకటించిన 50 లక్షలు అందచేత
కావలి, జూన్ 6(ఆంధ్రజ్యోతి): పహల్గాం ఉగ్రదాడుల్లో మృతి చెందిన నెల్లూరు జిల్లా కావలికి చెందిన సోమిశెట్టి మధుసూదనరావు కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. మధుసూదనరావు కుటుంబానికి ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ తన కుటుంబం తరఫున రూ.50 లక్షల ఆర్థిక సాయాన్ని ఇదివరకు ప్రకటించారు. ఈ మేరకు మంత్రి, టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్, జనసేన నేతలతో కలసి శుక్రవారం కావలిలోని మధుసూదన్‌రావు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. పవన్ ప్రకటించిన రూ.50 లక్షల్లో రూ.22.5 లక్షలు మధుసూదన్‌రావు కుమార్తె మధుశ్రీకి, రూ.22.5 లక్షలను కుమారుడు ముకుంద శ్రీదత్తుకు, రూ.5 లక్షలను తల్లి పద్మావతికి డీడీల రూపంలో అందజేశారు.