Share News

Summer Crops in E Crop System: వేసవి పంటలూ ఈ-క్రా‌ప్‌లో నమోదు

ABN , Publish Date - Apr 09 , 2025 | 05:07 AM

వేసవి పంటలను ఈ-క్రాప్‌లో నమోదు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రక్రియతో పంటల సాగు, దిగుబడుల అంచనాలు, గణాంకాలు సేకరించబడ్డాయి

Summer Crops in E Crop System: వేసవి పంటలూ ఈ-క్రా‌ప్‌లో నమోదు

అమరావతి, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): వేసవిలో సాగయ్యే పంటలను కూడా ఈ-క్రా్‌పలో నమోదు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి నుంచి ఏప్రిల్‌ మొదటి వారంలోగా విత్తుకుని, వేసవిలోనే ముగించే పంటలను మాత్రమే వేసవి ఈ-క్రా్‌పగా నమోదు చేయనున్నారు. వేసవి సాగు విస్తీర్ణం, దిగుబడి, ఉత్పత్తి అంచనాతో పాటు వరుస పంటల సరళిపై అధ్యయనానికి, గణాంకాలకు ఈ-క్రాప్‌ దోహదపడుతుందని వ్యవసాయశాఖ భావిస్తోంది. ఆధునికీకరించిన కొత్త వెర్షన్‌ ద్వారా వేసవి ఈ-క్రాప్‌ నమోదు ప్రక్రియను చేపట్టనున్నట్లు వ్యవసాయశాఖ డైరెక్టర్‌ డిల్లీరావు తెలిపారు. వేసవిలో ప్రధానంగా మినుము, పెసర సాగు వల్ల వాటి వ్యర్థాలతో భూమికి సేంద్రీయ పదార్థం అందుతుందని, అలాగే పచ్చిరొట్ట ఎరువుగా ఉపయోగపడే జనుము, పిల్లి పెసర, కాకిజొన్న, నువ్వులు, నేపియర్‌ గడ్డి వల్ల భూమిలోని తేమ ఆవిరి కాకుండా కాపాడతాయని వ్యవసాయశాఖ పేర్కొంటోంది.

Updated Date - Apr 09 , 2025 | 05:07 AM