CS K. Vijayanand: బలమైన నెట్‌వర్క్‌తోనే నిరంతరాయ విద్యుత్తు
ABN , Publish Date - Apr 19 , 2025 | 05:03 AM
ట్రాన్స్‌కో అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఇంధనశాఖ ప్రత్యేక కార్యదర్శి కె. విజయానంద్ విద్యుత్ సరఫరా నిరంతరాయంగా ఉండాలంటే బలమైన నెట్‌వర్క్ అవసరమని తెలిపారు. ఇప్పటికే పూర్తి అయిన ప్రాజెక్టులు మరియు కొనసాగుతున్న 55 ట్రాన్స్‌మిషన్ పనుల వివరాలను సమీక్షించారు
పురోగతిపై సమీక్షించిన కె.విజయానంద్
అమరావతి, ఏప్రిల్ 18(ఆంధ్రజ్యోతి): బలమైన నెట్‌వర్క్‌తోనే సుస్థిరమైన, నిరంతరాయమైన కరెంటు సరఫరా సాధ్యమని ట్రాన్స్‌కో అధికారులకు ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ సూచించారు. ట్రాన్స్‌మిషన్ నెట్‌వర్కింగ్ పనులపై శుక్రవారం ట్రాన్స్ జేఎండీ కీర్తి చేకూరి, డైరెక్టర్లు, ఇంజనీరింగ్ అధికారులతో విజయానంద్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో 1,095కోట్లతో 400 కేవీ ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్టులు ఏడు, 220 కేవీ ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్టులు 11పూర్తయ్యాయని.. వీటివల్ల విద్యుత్తు ట్రాన్స్‌మిషన్ సామర్థ్యం పెరుగుతుందని, లోఓల్టేజీ సమస్యలు నివారించవచ్చని వెల్లడించారు. రూ.4,065 కోట్లతో 55 ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్టుల పనులు శరవేగంగా జరుగుతున్నాయని కీర్తి చేకూరి వివరించారు.