SC Commission: తిరుపతి దాడి నిందితులపై కఠిన చర్యలు
ABN , Publish Date - Aug 13 , 2025 | 04:18 AM
తిరుపతిలో దళిత యువకుడు పవన్‌కుమార్‌పై 25 మందికిపైగా దాడికి పాల్పడ్డారు. ఇప్పటికే 16 మందిని..
ఎస్సీ కమిషన్ చైర్మన్ కె.ఎ్‌స.జవహర్
తిరుపతి (వైద్యం), ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): ‘తిరుపతిలో దళిత యువకుడు పవన్‌కుమార్‌పై 25 మందికిపైగా దాడికి పాల్పడ్డారు. ఇప్పటికే 16 మందిని గుర్తించి కేసులు నమోదు చేశారు. మిగిలిన వారినీ పట్టుకుంటారు. ఈ దాడికి పాల్పడిన, సహకరించిన, మద్దతుగా నిలిచిన అందరిపైనా అట్రాసిటీ చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి’ అని ఎస్సీ కమిషన్ రాష్ట్ర చైర్మన్ కె.ఎ్‌స.జవహర్ అన్నారు. తిరుపతిలో వైసీపీ నేతల దాడిలో గాయపడి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పవన్‌కుమార్‌ను మంగళవారం ఆయన పరామర్శించారు. ప్రభుత్వం తరపున అండగా నిలుస్తామని, అట్రాసిటీ చట్ట ప్రకారం రాయితీలను అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దాడికి పాల్పడిన వారు ఎంతటి వారైనా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పవన్‌కుమార్‌కు అట్రాసిటీ చట్ట ప్రకారం త్వరితగతిన న్యాయం చేసేందుకు అవసరమైన ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసి నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు.