AP Govt: ఉత్తమ పీఏసీఎస్‌లు, ఎఫ్‌పీవోల ఎంపికకు కమిటీ
ABN , Publish Date - Jun 03 , 2025 | 05:21 AM
ఎన్సీడీసీ 2025 అవార్డులకు ఉత్తమ పీఏసీఎస్‌లు, ఎఫ్‌పీవోలు ఎంపిక కోసం రాష్ట్ర స్థాయి కమిటీని ప్రభుత్వం నియమించింది. రైతులకు, మహిళలకు సేవలందించిన సహకార సంఘాలకు ప్రధాన బహుమతులు ప్రకటించారు.
అమరావతి, జూన్ 2(ఆంధ్రజ్యోతి): ఉత్తమ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, రైతు ఉత్పత్తి సంఘాలకు జాతీయ సహకార అభివృద్ధి సంస్థ(ఎన్సీడీసీ) ఎక్స్‌లెన్స్ అండ్ మెరిట్ అవార్డు-2025ను ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ అవార్డులకు అర్హత కలిగిన పీఏసీఎస్, ఎఫ్‌పీవోల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. రైతులకు, మహిళలకు రుణాలు, సహకారం అందించి ఉత్తమ సేవలు అందించినందుకు ప్రథమ బహుమతిగా రూ.35 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.25 వేలు ఇవ్వనున్నట్లు ఎన్సీడీసీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎన్సీడీసీ అవార్డులకు దరఖాస్తులను పరిశీలించి, ఉత్తమ సంఘాలను ఎంపిక చేయడానికి సహకార శాఖ రిజిస్ర్టార్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి ఎంపిక కమిటీని ప్రభుత్వం నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఏపీ ఆయిల్‌ఫెడ్ పర్సన్ ఇన్‌చార్జిని మరో ఆరు నెలలు(21.11.2025 వరకు) పొడిగిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.