corporate forces కార్పొరేట్ శక్తుల నుంచి దేశాన్ని యువతే కాపాడాలి
ABN , Publish Date - Feb 07 , 2025 | 12:19 AM
పెట్టుబడు దారులు, కార్పొరేట్ శక్తుల నుంచి ఈ దేశాన్ని యువతే రక్షించాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు.

ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై ఉద్యమించాలి
ఏఐవైఎఫ్ రాష్ట్ర మహాసభలో వక్తలు
గుజరాతీపేట, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): పెట్టుబడు దారులు, కార్పొరేట్ శక్తుల నుంచి ఈ దేశాన్ని యువతే రక్షించాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. గురువా రం ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పరుచూరి రాజేంద్రబా బు ఆధ్వర్యంలో రాష్ట్ర మహాసభల్లో భాగంగా గురువా రం ఆర్ట్స్ కళాశాల రోడ్డు సమీపంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. తొలుత రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన యువత నగరంలో భారీ ర్యాలీ చేపట్టా రు. ఏడు రోడ్ల జంక్షన్ నుంచి సభా ప్రాంగణం వరకు సాగింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడు తూ.. మరో స్వాతంత్య్ర పోరాటం చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. అల్లూరి పోరాట స్ఫూర్తితో యువత ఈ దేశంలో పెద్దఎత్తున పోరాటాలు చేయాలని పిలుపుని చ్చారు. 78 ఏళ్ల స్వాతంత్ర భారత దేశంలో పేదరికం పోయిందా అంటూ ప్రశ్నించారు. ఏఐవైఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి తిరుమలై రామన్ మాట్లాడుతూ.. దేశాన్ని కేంద్రంలోని బీజేపీ విభజించి పాలిస్తుందని, మతం, కులం, భాష పేరుతో దేశ ప్రజల ఐ్యతను దెబ్బ తీస్తుందన్నారు. ఏఐవైఎఫ్ మాజీ జాతీయ కార్యదర్శి జి.ఈశ్వరయ్య మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వాలు డబుల్ ఇంజన్ సర్కార్లు కాదని, బుల్డోజర్ సర్కార్లని రాష్ట్ర, దేశ ఆర్థిక అభివృద్ధిని రోజురోజుకు దిగజారుస్తుందన్నారు. 40 ఏళ్లుగా నాగావళి, వంశధార సాగునీటి ప్రాజెక్టు పూ ర్తిచేయకుండా ఒడిశాతో ఉన్న నీటి సమస్యను పరిష్క రించకుండా తాత్సారం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర అధ్యక్షుడు ప్రదీప్ మాట్లాడుతూ.. బీజేపీ పాలనలో ఆదివాసులకు రక్షణ లేకుండా పోయిందని మండి పడ్డా రు. ఈ సందర్భంగా వందేమాతరం శ్రీనివాస్ పలు విప్లవ గీతాలు ఆలపించారు. ఏఐవైఎఫ్ మాజీ జాతీయ కార్యదర్శి జి.ఈశ్వరయ్య, రాష్ట్ర కార్యదర్శి నక్కి లెనిన్ బాబు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారా యణమూర్తి, ఆహ్వాన కమిటి నాయకులు చాపర సుం దరలాల్, ఏఐవైఎఫ్ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.