Women's safety మహిళ భద్రతకు తొలి ప్రాధాన్యం
ABN , Publish Date - Mar 09 , 2025 | 12:20 AM
మ హిళలంతా సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నప్పుడే పరిపూర్ణమైన ప్రగతి సాధ్యమని, మహిళల భద్రతకు పోలీసు యంత్రాంగం తొలి ప్రాధా న్యం ఇస్తుందని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు.

శ్రీకాకుళం క్రైం, మార్చి 8(ఆంధ్రజ్యోతి): మ హిళలంతా సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నప్పుడే పరిపూర్ణమైన ప్రగతి సాధ్యమని, మహిళల భద్రతకు పోలీసు యంత్రాంగం తొలి ప్రాధా న్యం ఇస్తుందని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు. జిల్లా పోలీసు కార్యాల యంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురష్కరించుకొని జిల్లాలో విధులు నిర్వహ్తిస్తున్న 229 మంది మహిళా పోలీసులకు జెమ్స్ ఆ సుపత్రి సౌజన్యంతో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఎస్పీ ప్రారంభించి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లా డుతూ.. జిల్లాలో గతవారం రోజులుగా మహిళా సాధికారిత వారోత్సవాలు నిర్వహించామన్నారు. తొలుత జిల్లా పోలీసు కార్యాలయంల నుంచిడేఅండ్ నైట్ కూడలి వరకు ఏఎస్పీ కేవీ రమణ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు. డీఎస్పీలు సీహెచ్ వివేకానంద, ఎల్.శేషాద్రి, సీఐలు పైడపునాయుడు, ఈశ్వరరావు, సత్యనారాయణ, ఎస్‌ఐలు హరికృష్ణ, జనార్దన్, రాము, సందీప్, ప్రవల్లిక, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.