'Navodayam 2.0'.. ‘నవోదయం 2.0’తో.. సారా రహిత సిక్కోలు
ABN , Publish Date - Mar 07 , 2025 | 12:15 AM
జిల్లాను సారా రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు నవోదయం 2.0 కార్యక్రమాన్ని నిర్వహించను న్నట్టు జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ డి.శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.

ఆరు ప్రాంతాల్లో 110 సారా తయారీ కేంద్రాల గుర్తింపు
ప్రొహిబిషన్, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్‌రెడ్డి
శ్రీకాకుళం క్రైం, మార్చి 6(ఆంధ్రజ్యోతి): జిల్లాను సారా రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు నవోదయం 2.0 కార్యక్రమాన్ని నిర్వహించను న్నట్టు జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ డి.శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన తన కార్యాల యంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో సారాను అరికట్టేందుకు చర్యలు తీసు కుంటున్నామన్నారు. ముఖ్యంగా సోంపేట, టెక్కలి, పలాస, కొత్తూ రు, పాతపట్నం, ఇచ్ఛాపురం పరిధిలో ఏ,బీ,సీ కేటగిరీలుగా 110 సారా తయారీ కేంద్రాలను గుర్తించా మన్నారు. ఈ ప్రాంతా ల్లో ఎక్సైజ్ అధికారుల ను అడాప్షన్ అధికా రులుగా నియమించా మని వివరించారు. ఈ ఆరు ప్రాంతాల్లో ఐదు స్టేజ్‌లుగా విడదీసి గ్రామాల్లో ప్రజలకు సారా వల్ల కలిగే అనర్ధాలపై అవగాహన కల్పి స్తామన్నారు. అలాగే సారా తయారీ చేసే వ్యక్తులు, తరలించే వారు, విక్రయించే వారిని గుర్తించి వారి వివరాలు సేకరిస్తామన్నారు. గ్రామ, మండల స్థాయిలో రెవెన్యూ, పోలీసులు, అటవీశాఖాధికారులు, వీఆర్‌వోలు, సర్పంచ్‌లు, ఎన్‌జీవోలతో కలిసి కమిటీలు ఏర్పాటు చేస్తామ న్నారు. ఈ కమిటీల ద్వారా సారా వల్ల కలిగే దుష్ప్రభావాలపై ప్రజలకు, బెల్లం సరఫరా చేసే వ్యాపారులకు అవగాహన కల్పిస్తామన్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా రూ.వెయ్యికి పైగా పాత ముద్దాయిలను బైండోవర్లు కట్టామన్నారు. రెండోసారి సారాతో పట్టుబడితే కోర్టులో హాజరుపరచడంతో పాటు వారితో రూ.50వేలు నుంచి రూ.లక్ష వరకు జరిమానా విధిస్తామన్నారు. సారా రహిత జిల్లాకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.