Share News

చిత్తడి నేలలను పరిరక్షించుకోవాలి

ABN , Publish Date - Feb 03 , 2025 | 12:11 AM

భూమికి చిత్తడి నేలలు ఒక వరమని, వాటిని పరిరక్షించు కోవాలని, లేకుంటే భవిష్యత్‌ అంధకారంగా తయారవుతుందని కాకరాపల్లి థర్మల్‌ ఉద్య మకారులు నినదించారు.

చిత్తడి నేలలను పరిరక్షించుకోవాలి
టెక్కలి: విజేతకు బహుమతి అందిస్తున్న అటవీశాఖాధికారి

సంతబొమ్మాళి, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): భూమికి చిత్తడి నేలలు ఒక వరమని, వాటిని పరిరక్షించు కోవాలని, లేకుంటే భవి ష్యత్‌ అంధకారంగా తయారవుతుందని కాకరాపల్లి థర్మల్‌ ఉద్య మకారులు నినదించారు. చిత్తడి నేలల దినోత్సవం సందర్భంగా ఆదివారం వడ్డితాండ్రలో సమావేశం నిర్వహించారు. కాకరాపల్లి తంపర చిత్తడి నేలల పరిరక్షణకు ఈ ప్రాంత ఉద్యమ కారులు చేసిన పోరాటం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. చిత్తడి నేలల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. సమావేశంలో బీల ఉద్యమనేత ఢిల్లీరావు, ఉత్తరాంధ్ర జర్నలిస్టు సమాఖ్య అధ్యక్షుడు చౌదరి లక్ష్మణరావు, ఉద్యమనాయకులు అనంత, హన్నూరావు, మండల దన్నూ, కారుణ్య, కేశవ తదితరులు పాల్గొన్నారు.
అవగాహన కలిగి ఉండాలి
టెక్కలి, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి):
చిత్తడి నేలలపై అవగాహన కలి గి ఉండాలని డిప్యూటీ డీఎఫ్‌వో ఏవీ నాగేశ్వర రావు అన్నారు. ప్రపంచ చిత్తడి నేలల దినోత్స వాన్ని అటవీశాఖ ఆధ్వ ర్యంలో ఆదివారం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిత్తడి నేలలను ఎలా పరిరక్షించుకోవాలి, జీవ వైవిధ్యం, భవిష్యత్‌లో ఎటువంటి చర్యలు చేపట్టాలన్న అంశాలను వివరించారు. చిత్తడి నేలల్లో నివసించే పక్షిజాతుల రకాలు, వాటి పరిరక్షణకు తీసుకోవా ల్సిన చర్యలపై అవగాహన కలిగించారు. విద్యార్థులకు పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు. కార్యక్రమంలో టెక్కలి అటవీ సెక్షన్‌ అధికారి ఎస్‌.కృష్ణారావు, బీట్‌ అధికారి బి.ఝాన్సీ, రంజిత్‌, వార్డెన్‌ సునీత తదితరులు పాల్గొన్నారు.
భూగర్భ జలాల పరిరక్షణకు దోహదం
పాతపట్నం, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి):
చిత్తడి నేతలలతో భూగర్భ జలాల పరిరక్షణ సాధ్యమని, అందు వల్ల ఈ నేలలను కాపాడుకోవాలని జిల్లా సైన్స్‌ అధికారి నల్ల కుమార స్వామి అన్నారు. ప్రపంచ చిత్తడి నేల ల సంరక్షణ దినోత్సవాన్ని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆది వారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవవైవిఽధ్య పరిరక్షణకు చిత్తడి నేలల సంరక్షణ సామాజిక బాధ్యతగా స్వీకరించాలన్నారు. విద్యార్థులతో కలిసి అవ గాహన ర్యాలీ చేప ట్టారు. కార్యక్రమంలో హెచ్‌ఎం ఎస్‌.వైకుంఠరావు, గ్రీన్‌ ఉపాధ్యాయుడు ఎన్టీ రామారావు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Feb 03 , 2025 | 12:11 AM