'Secretariat' గోదాముగా ‘సచివాలయం’
ABN , Publish Date - Jan 16 , 2025 | 11:43 PM
కనిమెట్ట గ్రా మంలో నిర్మించిన నూతన సచివాలయం ప్రాంభించినా వినియోగంలోకి రాకుండాపోయింది.

- బిల్లులు చెల్లించలేదంటూ అప్పగించని కాంట్రాక్టర్
- సొంత అవసరాలకు వాడుకుంటున్న వైనం
- ఎమ్మెల్యే ఆదేశించినా.. పట్టించుకోని అధికారులు
పొందూరు, జనవరి 16(ఆంధ్రజ్యోతి): కనిమెట్ట గ్రా మంలో నిర్మించిన నూతన సచివాలయం ప్రాంభించినా వినియోగంలోకి రాకుండాపోయింది. దీంతో నూతన భనవం అందుబాటులో ఉన్నా ఓ ప్రైవేట్ ఆసుపత్రి లోనే సచివాలయాన్ని కొనసాగించాల్సిన పరిస్థితి నెల కొంది. వివరాల్లోకి వెళ్తే.. కనిమెట్ట సచివాలయాన్ని గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేపట్టారు. పక్కా భవనం ఉన్నా సచివాలయాన్ని మార్చకపోవ డంపై ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యం వల్లే కాంట్రాక్టర్ (సర్పంచ్ భర్త) ఆధీనంలో సచివాలయం ఉండిపో యిందని విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి సచివాలయాన్ని చెరవు గర్భంలో నిర్మించ డంతో అప్పట్లో వివాదమైంది. వైసీపీ ప్రజాప్రతినిధుల ఒత్తిడితో అధికారులు ఆ చెరువు గర్భంలోనే నిర్మించేందుకు అనుమతులు ఇచ్చారు. దీంతో 2020లో పనులు ప్రారంభించిన ఈ భవన నిర్మాణ పనులు 2023లో పూర్తయింది. దీంతో అప్పటి స్పీకర్ తమ్మినేని సీతారాం ఈ భవనాన్ని ప్రారంభించారు. అయితే ఆ తర్వాత అధికారులు బిల్లులు చెల్లించ లేదంటూ కాంట్రాక్టర్ గంగాధరరావు సచివాలయం తాళాలు ఇవ్వకుండా తన ఆధీనంలో ఉంచుకున్నారు. ఇప్పుడు ఈ భవనంలో కాంట్రాక్టర్ ధాన్యం బస్తాలు వేసి గోదాంగా వినియోగించుకుంటున్నారు. దీంతో గ్రామానికి చెందిన కొంతమంది నాయకులు ఎమ్మెల్యే కూన రవికుమార్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకు వెళ్లారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే తక్షణ మే ఆ సచివాలయ భవనాన్ని స్వాధీనం చేసుకుని విధులు నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ విషయంమై పంచాయతీరాజ్ డీఈ చంద్రశేఖర్‌ను వివరణ కోరగా.. చూస్తాం.. చెస్తామంటూ సరైన సమాధానం చెప్పకుండా దాట వేస్తుండడం విశేషం.