Veeragunnamma వీరగున్నమ్మ వంశీయుల ఆత్మీయ కలయిక
ABN , Publish Date - Jan 16 , 2025 | 12:11 AM
Veeragunnamma ‘చేనైనా కోయనీయ్.. లేదా బ్రిటీషోడి కుత్తుకైనా కోయనీయ్..’ అనే నాదంతో బ్రిటీష్ వారిపై సివంగిలా ఎగిసిపడ్డ వీరవనిత సాసుమాన వీరగున్నమ్మను స్మరించుకుంటూ ఆమె వంశీయులంతా కనుమ సందర్భంగా బుధవారం గరుడఖండి గ్రామంలో కలుసుకున్నారు.

పలాసరూరల్, జనవరి 15(ఆంధ్రజ్యోతి): ‘చేనైనా కోయనీయ్.. లేదా బ్రిటీషోడి కుత్తుకైనా కోయనీయ్..’ అనే నాదంతో బ్రిటీష్ వారిపై సివంగిలా ఎగిసిపడ్డ వీరవనిత సాసుమాన వీరగున్నమ్మను స్మరించుకుంటూ ఆమె వంశీయులంతా కనుమ సందర్భంగా బుధవారం గరుడఖండి గ్రామంలో కలుసుకున్నారు. మందస గడ్డపై 1940 ఏప్రిల్ ఒకటిన సాసుమాన వీర గున్నమ్మ బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడి వీరమరణం పొందారు. నాటి ఆమె పోరాటం, ఆమె వీరత్వాన్ని గుర్తు చేసుకుని ఈ ఆత్మీయ కలయిక నిర్వ హించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వీరమరణం పొంది న గున్న మ్మకు నివాళి అర్పించారు. కార్యక్రమంలో ఆమె కుటుంబ సభ్యులు సాసు మాన రామారావు, రామినాయుడు, రామయ్య, వైకుంఠరావు, హేమసుందర్, సూర్యనారాయణ, చంద్రమౌళి, అనిల్, వేణుగోపాల్, ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.