suicide భర్త వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య
ABN , Publish Date - Feb 24 , 2025 | 11:44 PM
suicide మండలంలోని బుషాభద్ర కాలనీలో వివాహిత కౌసల్య రౌళో (30) భర్త వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య కు పాల్పడింది.

సోంపేట, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): మండలంలోని బుషాభద్ర కాలనీలో వివాహిత కౌసల్య రౌళో (30) భర్త వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య కు పాల్పడింది. బారువ పోలీ సులు, స్థానికుల కథనం మేరకు.. బుషా భద్రకు చెంది న పంచనన్న రౌళో మొదటి భార్య మృతి చెందడంతో ఈదుపురానికి చెందిన కౌసల్య రౌళో ను తొమ్మిదేళ్ల కిందట వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న నాటి నుంచే కౌసల్యను వేధి స్తుండేవాడు. తరచూ ఇంట్లో గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో వేధింపు లు తట్టుకోలేక సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొంది. కౌసల్య రౌళో సోదరి కున్ని రౌళో ఫిర్యాదుమేరకు బారువ ఎస్‌ఐ హరిబాబు నాయుడు కేసు నమోదు చేశారు. పంచనన్న రౌళోను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.