Share News

Treatment ప్రభుత్వ వైద్యంపై నమ్మకం పెంచాలి

ABN , Publish Date - Feb 08 , 2025 | 12:19 AM

ప్రభుత్వ ఆసుపత్రు ల్లో అందిస్తున్న వైద్యంపై ప్రజలకు నమ్మకం కలిగించాలని ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అన్నారు.

Treatment  ప్రభుత్వ వైద్యంపై నమ్మకం పెంచాలి
వైద్య సిబ్బందికి సూచనలు చేస్తున్న ఎమ్మెల్యే రవికుమార్‌

  • ఎమ్మెల్యే కూన రవికుమార్‌

ఆమదాలవలస, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆసుపత్రు ల్లో అందిస్తున్న వైద్యంపై ప్రజలకు నమ్మకం కలిగించాలని ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అన్నారు. శుక్రవారం పట్టణంలోని 30 పడగల సీహెచ్‌సీలో నిర్వహించిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆసుపత్రిలో నెలకొన్న పలు సమస్యలు వైద్యాధికారి ధర్మాన హరిణి ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఆసుపత్రిలో చిన్న పిల్లల వైద్యులు లేక ఇబ్బంది పడుతున్నామని, జనరేటర్‌ లేకపోవడంతో విద్యుత్‌ సమస్య తీవ్రంగా ఉందని, ఎక్స్‌రే ప్లాంట్‌ మంజూరైనా నేటికీ ఏర్పాటు చేయలేదన్నారు. చిన్న పిల్లలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తానని సమావేశానికి హాజరైన సీనియర్‌ చిన్న పిల్లల వైద్యులు చాపర సుధాకర్‌ తెలిపారు. వైద్యులు, సిబ్బంది 39 మంది ఉన్నా.. ప్రతిరోజూ ఆసు పత్రికి వచ్చేవారి మాత్రం తక్కువగా ఉంటుందని, సరైన వైద్యం అందించ డం ద్వారా ప్రజల్లో నమ్మకం కల్పించా ల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎమ్మెల్యే సూచించారు. కాన్పులు ఎక్కువగా జరిగేలా ఆశ కార్యకర్తల ద్వారా అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రస్తుత ఆసుప త్రిలో నెలకొన్న సమస్యల పరిష్కారా నికి 20 లక్షల రూపాయలు వరకు ఖర్చు అవుతాయని, ఆసుప త్రిలో రెండు లక్షల మా త్రమే ఉన్నాయని డాక్టర్‌ హారిణి తెలిపారు. తన వంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే రవికుమార్‌ ప్రకటించారు. ఈ కార్య క్రమంలో ఎంపిడివో రోణంకి వెంకటరావు, ఆసుప త్రి పాలకవర్గం వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Feb 08 , 2025 | 12:19 AM