strike వ్యాపారుల బంద్ ప్రశాంతం
ABN , Publish Date - Jan 31 , 2025 | 12:11 AM
జేఆర్ పురం పట్టణం బంద్ ప్రశాంతంగా సాగింది. జేఆర్ పురం జాతీయ రహదారిపై తలపెట్టిన ఫ్లైఓవర్ పనులు వ్యాపారులు, ప్రజలతో చర్చించుకుండా సర్వేలు చేయడాన్ని వారు నిరసిస్తూ గురువారం బంద్ చేప ట్టారు.

రణస్థలం, జనవరి 30(ఆంధ్రజ్యోతి): జేఆర్ పురం పట్టణం బంద్ ప్రశాంతంగా సాగింది. జేఆర్ పురం జాతీయ రహదారిపై తలపెట్టిన ఫ్లైఓవర్ పనులు వ్యాపారులు, ప్రజలతో చర్చించుకుండా సర్వేలు చేయడాన్ని వారు నిరసిస్తూ గురువారం బంద్ చేప ట్టారు. స్వచ్ఛందంగా అన్ని దుకాణాలు మూసివేసి వ్యాపారులు బంద్‌లో పాల్గొన్నారు. అదేవిధంగా పబ్లిక్, ప్రైవేట్ బ్యాంక్స్, వివిధ సంస్థల మూసివేసి సంఘీభావం తెలిపా యి. ర్యాలీగా వెళ్లి సమస్యలతో కూడిన వినత పత్రం తహసీల్దార్ ఎన్.ప్రసాద్‌కు అందించారు. వీరికి మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్ సంఘీభావం తెలిపారు.