Share News

Vamsadhara: ‘వంశధార’ ఎస్‌ఈగా తిరుపతిరావు

ABN , Publish Date - Feb 08 , 2025 | 11:43 PM

Vamsadhara SE వంశధార ప్రాజెక్టు సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌గా పి.వి.తిరుపతిరావు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రిన్సిల్‌ చీఫ్‌ సెక్రటరీ నుంచి శ్రీకాకుళం వంశధార సర్కిల్‌ కార్యాలయానికి శుక్రవారం ఉత్తర్వులు అందాయి.

 Vamsadhara: ‘వంశధార’ ఎస్‌ఈగా తిరుపతిరావు
పి.వి.తిరుపతిరావు

  • హిరమండలం, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): వంశధార ప్రాజెక్టు సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌గా పి.వి.తిరుపతిరావు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రిన్సిల్‌ చీఫ్‌ సెక్రటరీ నుంచి శ్రీకాకుళం వంశధార సర్కిల్‌ కార్యాలయానికి శుక్రవారం ఉత్తర్వులు అందాయి. ప్రస్తుతం ఈయన విజయనగరం జిల్లా తారకరామ తీర్థసాగర్‌ ప్రాజెక్టు ఉపకార్యనిర్వహణ ఇంజనీర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో వంశధార కుడికాలువ పరిధిలో హిరమండలం వద్ద వయోడెక్టు నిర్మాణ సమయంలో ఆయన ఏఈ, డీఈగా బాధ్యతలు నిర్వహించారు. వంశధార ప్రాజెక్టుపై పూర్తి అవగాహన ఉందని గొట్టాబ్యారేజీ అభివృద్ధికి, వంశధార రిజర్వాయర్‌ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని తిరుపతిరావు తెలిపారు. సోమవారం బాధ్యతలు చేపట్టనున్నట్టు వెల్లడించారు. ఇప్పటివరకు టీటీపీఆర్‌ ఎస్‌ఈ కె.వి.ఎన్‌.స్వర్ణకుమార్‌.. వంశధార సర్కిల్‌ ఎఫ్‌ఏసీ ఎస్‌ఈగా బాధ్యతలు నిర్వహించేవారు.

Updated Date - Feb 08 , 2025 | 11:43 PM