పనులు చేశారు.. బిల్లులు మరిచారు
ABN , Publish Date - Feb 17 , 2025 | 11:52 PM
: మినీ గోకులాల లబ్ధిదారులు బిల్లులు చెల్లించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. పనులు పూర్తయినా బిల్లులు కాకపోవడంతో లబోదిబోమంటున్నారు.

టెక్కలి, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): మినీ గోకులాల లబ్ధిదారులు బిల్లులు చెల్లించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. పనులు పూర్తయినా బిల్లులు కాకపోవడంతో లబోదిబోమంటున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్‌ఆర్‌ఈజీ ఎస్ నిధులతో పాడి రైతులకు మినీగోకులాల నిర్మాణానికి పచ్చజెండా ఊపింది. ఎన్‌ఆర్‌ఈజీఎస్, పశుసం వర్ధకశాఖలు హడావుడితో మం డలంలో పంచాయతీకి ఒకటి చొప్పున్న పైలెట్ ప్రాజెక్ట్ కింద 39 మినీ గోకులాలు మంజూరుచేశాయి. అయితే ఇందులో 32 గోకులాలు యుద్ధప్రాతిపదికన లబ్దిదారులతో పనులు పూర్తిచేయించారు. రెండు ఆవుల మినీగోకులానికి రూ.లక్షా10వేలు, నాలుగు ఆవులు ఉన్న మినీ గోకులానికి రూ.లక్షా 85వేలు, ఆరు ఆవులు ఉన్న మినీగోకులానికి రూ.2లక్షల10వేలు నిధులు కేటాయించారు. అయితే పైలెట్ ప్రాజెక్ట్ కింద లబ్ధిదారులను ఎంపిక చేయడంతో పాడిరైతులు సైతం మినీ గోకులాలు నిర్మించారు. అయితే నిర్మించి నెలరోజులు దాటినా లబ్ధిదా రుల ఖాతాలో మాత్రం ఎన్‌ఆర్‌ఈజీఎస్ నుంచి ఒక్కపైసా కూడా విడుదల కాకపోవడంతో వారంతా ఆందోళనకుచెందుతున్నారు. కాగా మండలంలో 32 మినీగోకులాల బిల్లులు జనరేట్ చేశామని ఎన్‌ఆర్ ఈజీఎస్ ఏపీవో బగాది ప్రసాదరావు తెలిపారు. సుమారు ఎనిమిది వారాలుగా బిల్లులు చెల్లింపు నిలిచిపోయిందని, త్వరలో బిల్లులు చెల్లించనున్నట్లు చెప్పారు.