Share News

bird flu బర్డ్‌ ఫ్లూపై అపోహలు వద్దు

ABN , Publish Date - Feb 24 , 2025 | 12:38 AM

జిల్లాలో బర్డ్‌ఫ్లూ లేదని, ప్రజలు ఎటువంటి అపోహలకు పోవద్దని పశు సంవర్ధక శాఖ రిటైర్డు జేడీ మెట్ట వెంకటేశ్వరరావు తెలిపారు.

bird flu బర్డ్‌ ఫ్లూపై అపోహలు వద్దు
చికెన్‌, ఎగ్‌ పంపిణీ చేస్తున్న దృశ్యం

శ్రీకాకుళం క్రైం, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): జిల్లాలో బర్డ్‌ఫ్లూ లేదని, ప్రజలు ఎటువంటి అపోహలకు పోవద్దని పశు సంవర్ధక శాఖ రిటైర్డు జేడీ మెట్ట వెంకటేశ్వరరావు తెలిపారు. బర్డ్‌ఫ్లూపై ప్రజల్లో అపోహలు పోగొట్టేందుకు పశుసంవర్ధక శాఖ జేడీ కె.రాజగోపాల్‌ ఆధ్వర్యంలో ఉచిత చికెన్‌, ఎగ్‌ మేళాను ఆదివారం సాయంత్రం నిర్వహించారు. బాయిలర్‌ ఫార్మర్స్‌, ట్రేడర్స్‌ సహకారంతో పాతబస్టాండ్‌, ఆర్ట్స్‌ కళాశాల రోడ్డులో 500 కిలోల వండిన చికెన్‌, నాలుగు వేల ఉడకబెట్టిన గుడ్లు పంపిణీ చేశారు. సోమవారం చిలకపాలెం, పొందూరులో, మంగళ వారం నరసన్నపేట, టెక్కలి, హిరమండలంలో, శుక్రవారం పలాస, సోంపేటలో కూడా ఉచిత చికెన్‌, ఎగ్‌ మేళాల నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ వైద్యులు శ్రీనివాసరావు, సిబ్బంది రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 24 , 2025 | 12:38 AM