Voters: జిల్లా ఓటర్లు 18,80,065 మంది
ABN , Publish Date - Jan 06 , 2025 | 11:59 PM
Voters list జిల్లాలో మొత్తం 18, 80,065 మంది ఓటర్లు ఉన్నట్టు డీఆర్వో ఎం.వెంకటేశ్వరరావు తెలిపా రు. ఓటర్ల జాబితా సవరణ అనం తరం భారత ఎన్నికల సంఘం ఆదే శాల మేరకు తుది జాబితాను సోమ వారం ఆయన విడుదల చేశారు.

తుది జాబితా విడుదల
శ్రీకాకుళం కలెక్టరేట్, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మొత్తం 18, 80,065 మంది ఓటర్లు ఉన్నట్టు డీఆర్వో ఎం.వెంకటేశ్వరరావు తెలిపా రు. ఓటర్ల జాబితా సవరణ అనం తరం భారత ఎన్నికల సంఘం ఆదే శాల మేరకు తుది జాబితాను సోమ వారం ఆయన విడుదల చేశారు. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిం చిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తం గా జనవరి 5వ తేదీ నాటికి 18,80,065 మంది ఓటర్లు ఉన్నారని, ఇందులో పురుషులు 9,31,640 మంది, మహిళలు 9,48,299 మం ది, ఇతరులు 126 మంది ఉన్నట్టు తెలిపారు. అలాగే ఈ ఏడాది 18-19 మధ్య వయసు గల యువత 19,315 మంది ఎలక్టోరల్స్‌గా నమోదు చేసుకున్నారన్నారు. 80 ఏళ్లు దాటినవారు 31,609 మంది ఉన్నట్టు తెలిపారు. జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధి కంగా ఉన్నారని డీఆర్వో వెల్లడించారు.
జిల్లాలో ఓటర్ల వివరాలు
--------------------------------------------------------------------------------
నియోజకవర్గం పురుషులు మహిళలు ఇతరులు
--------------------------------------------------------------------------------
ఇచ్ఛాపురం 1,31,396 1,38,165 17
పలాస 1,07,496 1,12,414 21
టెక్కలి 1,17,977 1,18,694 09
పాతపట్నం 1,12,513 1,13,168 09
శ్రీకాకుళం 1,35,562 1,38,333 29
ఆమదాలవలస 96,094 97,610 15
ఎచ్చెర్ల 1,23,370 1,21,988 13
నరసన్నపేట 1,07,232 1,07,927 13