thermal plant థర్మల్ ప్లాంట్ ప్రతిపాదనను విరమించుకోవాలి
ABN , Publish Date - Jan 30 , 2025 | 12:32 AM
సరుబుజ్జిలి, బూర్జ మండలాల పరిధిలో 3200 మెగావాట్ల సామర్థ్యం గల థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకోవాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

శ్రీకాకుళం కలెక్టరే ట్, జనవరి 29(ఆంధ్రజ్యోతి): సరుబుజ్జిలి, బూర్జ మండలాల పరిధిలో 3200 మెగావాట్ల సామర్థ్యం గల థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకోవాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక కలెక్టరేట్ ఎదుట బుధవారం ధర్నా కార్యక్రమం చేపట్టి మాట్లాడారు. ఈ ప్లాంట్ నిర్మాణం జరిగితే సుమారు 30 ఆదివాసీ గ్రామాల పరిధిలో గల రెండువేల మంది బాధితులుగా మారిపోతారన్నారు. ఈ ప్రాంతం మొత్తం దుమ్ము, ధూళితో పాటు ప్రజలు వ్యాధుల బారిన పడతారన్నారు.