బాలికల లింగ నిష్పత్తి పెంచాలి
ABN , Publish Date - Jan 30 , 2025 | 12:35 AM
బాలికల లింగ నిష్పత్తిని పెంచాలని శ్రీకాకు ళం ఎమ్మెల్యే గొండు శంకర్ పిలుపునిచ్చారు.

అరసవిల్లి, జన వరి 29(ఆంధ్ర జ్యోతి): బాలికల లింగ నిష్పత్తిని పెంచాలని శ్రీకాకు ళం ఎమ్మెల్యే గొండు శంకర్ పిలుపునిచ్చారు. బాలికలను ‘రక్షించండి-బాలికలను చదివించండి’ కార్యక్రమాన్ని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కళావేదికలో బుధవారం నిర్వహించారు. ముఖ్యఅతి థిగా హాజరైన ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ.. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో అమ లు చేస్తున్నాయన్నారు. అనంతరం ఆడబిడ్డలకు జన్మనిచ్చిన తల్లులకు చైల్డ్ ఇన్సెంటీవ్ కిట్లను 50 మందికి అందజేసి, అక్కడే ఏర్పాటు చేసిన పిల్లల ఊయలను ఎమ్మెల్యే ప్రారంభించారు. అలాగే దత్తత పోస్టర్‌ను ఆవిష్కరించి క్రీడల్లో గెలుపొందిన 10 మందికి రూ.2500 నగదు, మెమెంటోలు అందజేశారు. కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ బి.శాంతిశ్రీ, డీఎంహెచ్‌వో బాల మురళీకృష్ణ, డీఈవో తిరుమల చైతన్య తదితరులు పాల్గొన్నారు.