Share News

మస్తర్లు కచ్చితంగా వేయాలి : పీడీ

ABN , Publish Date - Jan 18 , 2025 | 11:53 PM

ఉపాధి పథకం ద్వారా చేపడుతున్న పనులకు సంబంధించి మస్తర్లు కచ్చితంగా వేయకపోతే చర్యలు తప్పవని డ్వామా పీడీ సుధాకరరావు హెచ్చరించారు.

 మస్తర్లు కచ్చితంగా వేయాలి : పీడీ
మాట్లాడుతున్న సుధాకరరావు :

గార, జనవరి 18 (ఆంధ్రజ్యోతి):ఉపాధి పథకం ద్వారా చేపడుతున్న పనులకు సంబంధించి మస్తర్లు కచ్చితంగా వేయకపోతే చర్యలు తప్పవని డ్వామా పీడీ సుధాకరరావు హెచ్చరించారు. శనివారం గారలో ప్రజా వేదిక కార్యక్రమం నిర్వహించారు. తొలుత శ్రీకూర్మంలో 3500 ఉపాధి వేతనదారులు ఉన్నారని, ఇద్దరు ఫీల్డ్‌ అసిస్టెంట్‌ సరిపోవడం లేదని, అదనంగా ఇద్దరు ఫీల్డ్‌ అసిస్టెంట్‌లను నియమించాలని వైస్‌ఎంపీపీ అంధవరపు భాగ్యలక్ష్మి కోరారు. బందరువానిపేటలో పలువురికి జాబ్‌ కార్డులు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆ గ్రామ పెద్దలు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ రఘురామ్‌, ఎంపీడీవో ఎస్‌.రామమోహనరావు, ఏపీడీ రాధ, ఏపీవో సంధ్యారాణి, ఏఈ గోవిందరావు పాల్గొన్నారు.

Updated Date - Jan 18 , 2025 | 11:53 PM