parade పరేడ్ ఆకర్షణీయంగా ఉండాలి
ABN , Publish Date - Jan 25 , 2025 | 11:56 PM
జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించనున్న గణతంత్ర వేడుకల్లో పోలీసు సిబ్బంది చేపట్టే పరేడ్ జిల్లా ప్రజలను ఆకట్టుకునే విధంగా ఉండాలని ఏఎస్పీ కేవీ రమణ సిబ్బందిని ఆదేశించారు.

ఏఎస్పీ రమణ
శ్రీకాకుళం క్రైం, జనవరి 25(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించనున్న గణతంత్ర వేడుకల్లో పోలీసు సిబ్బంది చేపట్టే పరేడ్ జిల్లా ప్రజలను ఆకట్టుకునే విధంగా ఉండాలని ఏఎస్పీ కేవీ రమణ సిబ్బందిని ఆదేశించారు. ఈ మేరకు స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో శనివారం పోలీసులు నిర్వహించిన పెరేడ్ రిహార్సల్స్‌ను ఆయన పరిశీలించారు. అనంతరం పరేడ్ గ్రౌండ్‌ను చూశారు. ఈ కార్యక్రమం లో ఆర్మ్‌డ్ రిజర్వ్ డీఎస్పీ ఎల్.శేషాద్రి, పోలీసు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.