లేఆఫ్ నోటీసు ఉపసంహరించుకోవాలి
ABN , Publish Date - Feb 24 , 2025 | 11:47 PM
:వరిసాంలోని శ్యాంపిస్ట్స్-2 పరిశ్రమలో అక్రమ లేఆఫ్ నోటీసులను ఉపసంహరించుకోవాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్య దర్శులు సీహెచ్ అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు డిమాండ్ చేశారు.

రణస్థలం, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి):వరిసాంలోని శ్యాంపిస్ట్స్-2 పరిశ్రమలో అక్రమ లేఆఫ్ నోటీసులను ఉపసంహరించుకోవాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్య దర్శులు సీహెచ్ అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు డిమాండ్ చేశారు. రణస్థలం తహసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో శ్యాంపిస్టన్స్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.అప్పలనరసయ్య, గొర్లె కిరణ్, వెలమల రమణ, ఆర్‌ఎస్ నాయుడు పాల్గొన్నారు.