Share News

Midday Meal విద్యార్థుల ఆకలి తీర్చడమే సంకల్పం: ఎంజీఆర్‌

ABN , Publish Date - Jan 07 , 2025 | 12:05 AM

Midday Meal ప్రభుత్వ పాఠశాల లు, కళాశాలల్లో విద్యార్థుల ఆకలి తీర్చడమే ప్రభుత్వ సంకల్పమని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు.

Midday Meal విద్యార్థుల ఆకలి తీర్చడమే సంకల్పం: ఎంజీఆర్‌
కొత్తూరు: విద్యార్థినులకు భోజనం వడ్డిస్తున్న ఎమ్మెల్యే మామిడి గోవిందరావు

హిరమండలం/కొత్తూరు, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాల లు, కళాశాలల్లో విద్యార్థుల ఆకలి తీర్చడమే ప్రభుత్వ సంకల్పమని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. హిరమండలం, కొత్తూరు ప్రభుత్వ జూని యర్‌ కళాశాలలో అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథ కాన్ని సోమవారం పరిశీలించారు. విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. విద్యా సంస్థల బలోపేతమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పి.బుచ్చిబాబు, మండల ప్రత్యేక ఆహ్వానితుడు తూలు గు తిరు పతిరావు, తహసీల్దార్‌ హనుమంతురావు, ఎంఈవో కె.రాంబాబు, ఉపాధ్యా యులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jan 07 , 2025 | 12:05 AM