Share News

ఆదిత్యుని హుండీల ఆదాయం రూ.64.39లక్షలు

ABN , Publish Date - Feb 12 , 2025 | 12:13 AM

ఆరోగ్య ప్రదాత అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి హుండీలను మంగళవారం లెక్కించారు. మొత్తం 19 రోజులకు గాను రూ.64,39,016 ఆదాయం లభించింది. ఇందులో నోట్ల రూపంలో రూ.62,10,095, చిల్లర రూ.2,28,921 లభించాయి.

ఆదిత్యుని హుండీల ఆదాయం రూ.64.39లక్షలు
ఆదిత్యాలయంలో హుండీల లెక్కింపు దృశ్యం:

అరసవల్లి, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్య ప్రదాత అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి హుండీలను మంగళవారం లెక్కించారు. మొత్తం 19 రోజులకు గాను రూ.64,39,016 ఆదాయం లభించింది. ఇందులో నోట్ల రూపంలో రూ.62,10,095, చిల్లర రూ.2,28,921 లభించాయి. బంగారం 17.4 గ్రాములు, వెండి 1 కేజీ 212 గ్రాములు, యూఎస్‌ డాలర్లు 30, ఖతార్‌, ఒమన్‌ కరెన్సీ కూడా ఉందని ఈవో భద్రాజీ తెలిపారు. అనువంశిక ధర్మకర్త ఇప్పిలి జోగి సన్యాసిరావు, ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ పర్యవేక్షణలో శ్రీహరి సేవ, సత్యసాయి సేవా సమితి, శ్రీవారి సేవా సమితి వారు ఈ లెక్కింపు చేపట్టారు. ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ అధికారి ప్రసాదరావు పట్నాయక్‌, శ్రీకూర్మం దేవస్థానం ఈవో గురునాథం, ఆమదాలవలస దేవాలయాల ఈవో తమ్మినేని రవి, ఆలయ సూపరింటెండెంట్‌ ఎస్‌.కనకరాజు తదితరులు పాల్గొన్నారు. ఇలా ఉండగా.. గత ఏడాది రథసప్తమి ఆదాయ వివరాలను విలేకరులకు వెల్లడించడానికి ఆలయ సిబ్బంది నిరాకరించడం గమనార్హం.

Updated Date - Feb 12 , 2025 | 12:13 AM