Share News

సమగ్రాభివృద్ధి సాధనే లక్ష్యం

ABN , Publish Date - Jan 18 , 2025 | 11:52 PM

ఉపాధి హామీ పథకం ద్వారా సమగ్రాభివృద్ధి సాధించ డమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ తెలిపారు.

   సమగ్రాభివృద్ధి సాధనే లక్ష్యం
మాట్లాడుతున్న ఎమ్మెల్యే రవికుమార్‌ :

ఆమదాలవలస, జనవరి 18 (ఆంధ్ర జ్యోతి): ఉపాధి హామీ పథకం ద్వారా సమగ్రాభివృద్ధి సాధించ డమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ తెలిపారు. శనివారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ తమ్మినేని శారద అధ్యక్షతన జరిగిన కార్య క్రమంలో మండల పరిషత్‌ 2024-25 సవరణ బడ్జెట్‌తో పాటు 2025-26 అంచనా బడ్జెట్‌ను ఆమోదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవికుమార్‌ 2023 సంవత్సరం నుంచి మండల పరిషత్‌ బడ్జెట్‌ పూర్తి వివరాలు, రాబడులు, ఖర్చులు, మిగులు బడ్జెట్‌ తెలియజేయాలని కోరారు. పూర్తి వివరాలతో కూడిన నివేదిక అందిస్తామని ఎంపీడీవో ఆర్‌.వెంకటరావు తెలిపారు. ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీలకు గౌరవ వేతనాలు కూడా వైసీపీ ఐదేళ్ల పాలనలో అందించకుండా మండల పరిషత్‌, పంచాయతీలో నిధులు కూడా దరి మళ్లించి గ్రామాభివృద్ధిని అడ్డుకున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. కార్య క్రమంలో జడ్పీటీసీ బెండి గోవిందరావు, మండల ప్రత్యేకాహ్వానితులు తమ్మినేని శ్రీరామ్మూర్తి టీడీపీ నా యకులు తమ్మినేని చంద్రశేఖర్‌, నూకరాజు, సనపల ఢిల్లీశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - Jan 18 , 2025 | 11:52 PM