Share News

Jatara వైభవంగా పద్మనాభుని జాతర

ABN , Publish Date - Jan 16 , 2025 | 12:12 AM

Jatara కనుమ పర్వదినం సందర్భంగా శ్రీముఖలింగేశ్వరాలయం క్షేత్రపాలకుడు పద్మనాభుని జాతర బుధవారం వైభవంగా జరిగింది.

Jatara వైభవంగా పద్మనాభుని జాతర
జలుమూరు: కరకవలస పద్మనాభుని జాతరలో పాల్గొన్న భక్తులు

జలుమూరు, జనవరి 15ఆంధ్రజ్యోతి): కనుమ పర్వదినం సందర్భంగా శ్రీముఖలింగేశ్వరాలయం క్షేత్రపాలకుడు పద్మనాభుని జాతర బుధవారం వైభవంగా జరిగింది. కరకవల సమీపంలోని కొండపై ఉన్న కృష్ణార్జునులను దర్శించుకునేందుకు భక్తులు తరలి రావడంతో వేలాది మంది తరలివచ్చారు. జలుమూరు, సారవకోట, హిరమండలం, ఎల్‌ఎన్‌పేట మండలాలకు చెందిన భక్తులు తరలి వచ్చారు. కొండపై కొలువుదీరిన స్వామిని భక్తులు దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి తరించారు. శ్రీముఖలింగంలోని శ్రీముఖలింగేశ్వరాలయంలో బుధవారం గోపూజ నిర్వహించారు.

భక్తజన సందోహం

కన్నుల పండువగా డేకురు కొండ ఉత్సవం

పలాస, జనవరి 15(ఆంధ్రజ్యోతి): డేకురుకొండ ఉత్సవం మంగళ వారం ఘనంగా నిర్వహించారు. స్థానిక హడ్కో కాలనీకి సమీపంలో ఉన్న డేకురుకొండపై ప్రతి ఏటా సంక్రాంతి నాడు ఉత్సవం చేయడం ఆనవాయితీ. కొండపై ఉన్న దేవతామూర్తులను దర్శించుకుని అక్కడ ఉన్న జారుడు కొండపై నుంచి పిల్లలు లేని స్త్రీలు జారితే పిల్లలు పుడతారని నమ్మకం. ఈ కారణంగా సంక్రాంతికి వచ్చే కొత్త అల్లుళ్లు, కోడళ్లతో వందలాది కుటుంబీకులు వచ్చి ఉత్సవం నిర్వహించడం పరి పాటిగా మారింది. నానాటికీ భక్తుల సంఖ్య పెరుగుతుండడంతో తిరు నాళ్లలా సందడి నెలకొంది. ఉదయం నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ ఉత్సవాలు జరిగాయి. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అధిక సంఖ్య లో భక్తులు తరలి వచ్చి డేకురుకొండ ఉత్సవంలో పాల్గొన్నారు. తర్లాకోట జమిందారుల నాటి నుంచి ఈ ఆచారం కొనసాగుతోంది. కాశీబుగ్గ పోలీసుల ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

వేడుకగా పార్వేట ఉత్సవం

నరసన్నపేట, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో సంతతోటలో వేంకటేశ్వర స్వామి ఆలయంలో పార్వేట ఉత్సవం మంగళవారం కన్నుల పండువగా నిర్వహించారు. అర్చకులు చామర్తి శ్రీనివాస కృష్ణమా చార్యులు ఆధ్వర్యంలో గోదా రంగనాథస్వామి అలక సంబరం, రంగనాథ స్వామి పార్వేట ఉత్సవాన్ని చేపట్టారు. అలాగే రావాడపేట వద్ద కనక దుర్గా అమ్మవారి ఆలయ 7వ వార్సికోత్సవం బుధవారం కనుమ జాతర చేపట్టారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిం చారు. పారశెల్లిలో జాతర నిర్వహించారు.

Updated Date - Jan 16 , 2025 | 12:12 AM