ఇంట్లోకి దూసుకొచ్చిన బైక్
ABN , Publish Date - Feb 12 , 2025 | 12:06 AM
చావు ఏ రూపంలో వస్తుందో.. ఎలా వస్తుందో ఎవ్వరికీ తెలియదనేందుకు మండల పరిధిలోని ఒమ్మి పంచాయతీ కొత్తపేటలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం.

రాజాం రూరల్, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): చావు ఏ రూపంలో వస్తుందో.. ఎలా వస్తుందో ఎవ్వరికీ తెలియదనేందుకు మండల పరిధిలోని ఒమ్మి పంచాయతీ కొత్తపేటలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. అప్పటివరకూ ఇంటి గడపలో భార్యా భర్తలిద్దరూ కష్టసుఖాలు మాట్లాడుకుంటున్నారు. ఇంత లో మంచినీరు తెస్తానని చెప్పి భార్య వీధిలోకి వెళ్లింది. భర్త ఒక్కరే స్టూల్‌పై కూర్చుని ఉన్నారు. హఠాత్తుగా ఓ బైక్ ఇంట్లోకి దూసుకొచ్చి స్టూల్‌పై ఉన్న అతడిని బలంగా ఢీకొంది. ఏమైందో తెలుసుకునే లోపు పెద్దపెద్ద కేకలు పెడుతూ నేలకూలాడు ఆ వ్యక్తి. బైక్‌తో ఢీకొన్న వ్యక్తి సైతం తీవ్ర గాయాలపాలై గడపలో పడిపోయాడు. అప్పుడే మంచినీటి కోసం బయటకు వెళ్లిన భార్య ఇంటి వద్ద జనం గుమిగూడి ఉండడం చూసింది. విషయం తెలుసుకుని గుండెలు బాదుకుంది. ఇందుకు సంబంధిం చిన వివరాల్లోకి వెళితే.. మధ్యాహ్న 3 గంటల సమయంలో ఇం ట్లో భార్యాభర్తలు సీత, మాధవరావు కష్టసుఖాలు మాట్లాడుకుంటున్నారు. మంచినీరు తెచ్చేం దుకు సీత వీధిలోకి వెళ్లడంతో ఒక్కడే కూర్చుని మాధవరావు ఏదో ఆలోచిస్తు న్నాడు. ఇంతలో రాజాం వైపు నుంచి బొబ్బిలి వైపు ద్విచక్ర వాహనంపై మితి మీరిన వేగంతో వెళ్తున్న వ్యక్తి నేరుగా మాధవరావు ఇంటి గడపలోకి బైక్‌తో దూ సుకొచ్చి ఆయనను ఢీకొన్నాడు. దాంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. బైక్‌తో ఢీ కొన్న వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. రాజాం సామాజిక ఆసుపత్రి లో ప్రాఽథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం తరలించారు. గాయపడిన వ్యక్తిది శ్రీకాకుళం. కాగా రెవెన్యూశాఖలో సర్వేయర్‌గా మాధవరావు విధులు నిర్వహిస్తున్నాడు. భార్య సీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజాం పొలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.