Share News

శ్రీకూర్మనాథుడు, ఆదిత్యుడ్ని దర్శించుకున్న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు

ABN , Publish Date - Jan 18 , 2025 | 12:00 AM

High Court, judges అరసవల్లిలోని ఆదిత్యుడ్ని, గార మండలం శ్రీకూర్మంలోని కూర్మనాథుడిని తెలంగాణ హైకోర్టు జడ్జిలు జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌, జస్టిస్‌ కె.లక్ష్మణ్‌, జస్టిస్‌ జె.శ్రీనివాసరావు కుటుంబ సమేతంగా శుక్రవారం దర్శించుకున్నారు.

శ్రీకూర్మనాథుడు, ఆదిత్యుడ్ని దర్శించుకున్న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు
శ్రీకూర్మనాథుడి సన్నిధిలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ వినోద్‌కుమార్‌, జస్టిస్‌ లక్ష్మణ, జస్టిస్‌ శ్రీనివాసరావు తదితరులు

అరసవల్లి/ గార, జనవరి 17(ఆంధ్రజ్యోతి): అరసవల్లిలోని ఆదిత్యుడ్ని, గార మండలం శ్రీకూర్మంలోని కూర్మనాథుడిని తెలంగాణ హైకోర్టు జడ్జిలు జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌, జస్టిస్‌ కె.లక్ష్మణ్‌, జస్టిస్‌ జె.శ్రీనివాసరావు కుటుంబ సమేతంగా శుక్రవారం దర్శించుకున్నారు. వారికి అరసవల్లిలో ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ స్వాగతం పలుకగా, అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. స్వామివారి జ్ఞాపికను ఈవో వై.భద్రాజీ అందజేశారు. అలాగే శ్రీకూర్మంలో ఈవో జి.గురునాఽథరావు, ప్రధాన అర్చకులు సీతారామ నరసింహాచార్యులు, ఇతర అర్చకులు వారికి స్వాగతం పలికారు. స్వామి ప్రసాదాన్ని చిత్ర పటాన్ని ఈవో గురునాఽథరావు వారికి అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్‌ సబ్‌ జడ్జి జస్టిస్‌ యుగంధర్‌, డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి సన్యాసినాయుడు, ఆలయ సూపరింటెండెంట్‌ కనకరాజు, అర్చకులు ఇప్పిలి రంజిత్‌ శర్మ పాల్గొన్నారు.


arasavalli.gif

Updated Date - Jan 18 , 2025 | 12:00 AM