BJP: బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా తేజేశ్వరరావు
ABN , Publish Date - Jan 21 , 2025 | 11:54 PM
District President భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా సిరిపురం తేజేశ్వరరావును ఎన్నుకున్నారు. శ్రీకాకుళంలోని టౌన్‌హాల్ వద్ద ఓ ఫంక్షన్‌హాల్‌లో మంగళవారం బీజేపీ నాయకులు సమావేశమై నూతన అధ్యక్షుడిని ప్రకటించారు.
గుజరాతీపేట, జనవరి 21(ఆంధ్రజ్యోతి): భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా సిరిపురం తేజేశ్వరరావును ఎన్నుకున్నారు. శ్రీకాకుళంలోని టౌన్‌హాల్ వద్ద ఓ ఫంక్షన్‌హాల్‌లో మంగళవారం బీజేపీ నాయకులు సమావేశమై నూతన అధ్యక్షుడిని ప్రకటించారు. ప్రస్తుత అధ్యక్షుడు బిర్లంగి ఉమామహేశ్వరరావుతో పాటు మరికొందరు అధ్యక్ష పదవికి నామినేషన్లు వేశారు. కాగా కొత్తవారికి చోటు కల్పించాలన్న ఉద్దేశంతో అధిష్ఠానం తేజేశ్వరరావు పేరును ఖరారు చేసినట్లు బీజేపీకి చెందిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే నదుకుదిటి ఈశ్వరరావు తెలిజేశారు. పార్టీ అభ్యున్నతికి కృషి చేయాలని ఆయన కోరారు. పాతపట్నం మండలం సరాళి గ్రామానికి చెందిన తేజేశ్వరరావు.. గుజరాత్ రాష్ట్రంలో ఒకప్పుడు ఉద్యోగం చేసేవారు. కొన్నాళ్ల కిందట ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చారు. సమావేశం అనంతరం స్థానిక టౌన్‌హాల్ నుంచి ఏడు రోడ్ల కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకులుగా సుహాసిని ఆనంద్, బీజేపీ రాష్ట్ర నాయకులు పైడి వేణుగోపాలం, పూడి తిరుపతిరావు, సంపతిరావు నాగేశ్వరరావు, కాశీ విశ ్వనాఽథం, చల్లా వెంకటేశ్వరరావు, ఉమామహేశ్వరి పాల్గొన్నారు.