బాధ్యులపై చర్యలు తీసుకోండి
ABN , Publish Date - Jan 30 , 2025 | 11:58 PM
స్థానిక జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఈనెల 24న అప్పుడే పుట్టిన బిడ్డకు హెపటైటిస్-బి వ్యాక్సిన్ వేసి తొడలో సూది మరచిపోయిన సంఘటనపై మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పందించారు.

టెక్కలి, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): స్థానిక జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఈనెల 24న అప్పుడే పుట్టిన బిడ్డకు హెపటైటిస్-బి వ్యాక్సిన్ వేసి తొడలో సూది మరచిపోయిన సంఘటనపై మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పందించారు. దీనిపై విచారణకు ఆదేశించారు. ఈ సంఘటనకు సంబంధించి గురువారం ‘ఆంధ్రజ్యోతిలో ‘వ్యాక్సిన్ వేశారు.. సూది మరిచారు’ శీర్షికతో ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. విధి నిర్వహణలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను ప్రశ్నించారు. ఇందుకు కారణమైన వారిపై చర్యలు తీసు కోవాలని ఆదే శించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్పష్టం చేశారు. మరోవైపు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ దీనిపై విచా రణకు ఆదేశించారు. నరసన్నపేట ఏరియా ఆసుపత్రి సూప రింటెండెంట్ డాక్టర్ సీపాన శ్రీనుబాబు, కార్యాలయ ప్రతినిధి కాళీని విచారణకు నియమించారు. వీరు గురువారం జిల్లా కేంద్ర ఆసుపత్రిలో సూప రింటెండెంట్ డాక్టర్ సూర్యారావు, చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ శ్రీనివాస్, మేటీ అసిస్టెంట్ లక్ష్మి, సిబ్బందిని విచారిం చారు. బాధిత బిడ్డతో పాటు తల్లి కల్పన నందిగాం మండలం కల్లాడలో తాతగారి ఇంటికి వెళ్లడంతో అక్కడికి వెళ్లి మరీ సంఘ టనపై వివరాలు సేకరించారు. జిల్లా కేంద్ర ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది మాత్రం తొడ లో సూది మర్చిపోవడం అసాధ్యమని... సూదిని ఎక్కడి నుంచి తెచ్చారో తమకు తెలియదని అంటున్నారు. బిడ్డ తల్లి కల్పన మాత్రం ఈ సూది తొడలోనే లభ్యమైందని చెబుతున్నారు. మరోవైపు ఆసుపత్రిలో జరిగిన సంఘటనపై ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి స్పందించారు. వివరాలు తెలియజేయాలని సూపరింటెండెంట్ డాక్టర్ సూర్యారావును ఆదేశించారు.
ఆ సూది సిరంజీకి సంబంధించినదే..
ఆ సూది సిరంజీకి సంబంధించినదేనని విచారణాధికారి డాక్టర్ సీపాన శ్రీనుబాబు స్పష్టం చేశారు. గురువారం నందిగాం మండలం కల్లాడలో బిడ్డను పరిశీలించారు. తల్లి కల్పనతో మాట్లాడారు. ఆ బిడ్డ వద్ద లభ్యమైన సూది సిరంజీకి సంబంధించి నదిగా గుర్తించినట్లు ఆయన ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. బిడ్డ ఆరోగ్యంగా ఉందని, వ్యాక్సినేషన్ వేసిన ప్రాంతంలో వాపు కూడా లేదని గుర్తించామన్నారు. విచారణ నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు సమర్పిస్తామని ఆయన తెలిపారు.