Cashew జీడి పిక్కలకుమద్దతు ధర ప్రకటించాలి
ABN , Publish Date - Feb 07 , 2025 | 11:45 PM
Cashew జీడి పిక్కలకు మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకో వాలని జీడి రైతు సంఘ నాయకులు కోరారు. ఈ మేరకు శుక్రవారం టీడీపీ కార్యాల యంలో ఎమ్మెల్యే గౌతు శిరీషను కలిసి వినతి పత్రం అందిం చారు.

ఎమ్మెల్యే శిరీషకు విన్నవించిన జీడిరైతు సంఘ నాయకులు
పలాస, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): జీడి పిక్కలకు మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకో వాలని జీడి రైతు సంఘ నాయకులు కోరారు. ఈ మేరకు శుక్రవారం టీడీపీ కార్యాల యంలో ఎమ్మెల్యే గౌతు శిరీషను కలిసి వినతి పత్రం అందిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 80 కిలోల జీడి పిక్కల బస్తా రూ.16 వేలు కనీస మద్దతు ధర ప్రక టించేలా కృషి చేయాలన్నారు. సంఘ కన్వీనర్ తెప్పల అజయ్‌కుమార్ మాట్లాడుతూ.. జీడి సాగు వ్యయం పెరగ డంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, 2018లో రూ.15 వేలు పలికిన ధర ప్రస్తుతం రూ.8 వేలకు పడిపో యిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభు త్వమే నేరుగా జీడి పిక్కలను కొనుగోలు చేసి వ్యాపారులకు అంది స్తే రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. పలాసలో జీడి పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని, నాణ్యమైన జీడి మొక్కలు ఉచితం గా అందించాలని, జీడితోటల అభివృద్ధికి మూడేళ్లకు రూ.94 వేలు చొప్పున రైతులకు ఇవ్వాలని కోరారు. కార్యక్ర మంలో ఏపీ రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.మోహన రావు, నాయకులు ఎన్.గణపతి, కోనేరు ఆది నారాయణరావు, జి.బాలకృష్ణ, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.