Share News

నిరంతర సాధనతోనే గెలుపు: ప్రభుత్వ విప్‌

ABN , Publish Date - Jan 17 , 2025 | 11:31 PM

నిరంతరం సాధనతోనే క్రీడాకారులకు గెలుపు సాధ్యమవుతుందని ప్రభుత్వ విప్‌ బెందాళం అశోక్‌ తెలిపారు. శుక్రవారం కంచిలి బీపీ కాలనీలో శ్రీకంచమ్మ తల్లి ఐపీఎల్‌ టోర్నమెంట్‌ ప్రారంభించారు.

 నిరంతర సాధనతోనే గెలుపు: ప్రభుత్వ విప్‌
మాట్లాడుతున్న బెందాళం అశోక్‌ :

కంచిలి, జనవరి 17 (ఆంఽధ్రజ్యోతి):నిరంతరం సాధనతోనే క్రీడాకారులకు గెలుపు సాధ్యమవుతుందని ప్రభుత్వ విప్‌ బెందాళం అశోక్‌ తెలిపారు. శుక్రవారం కంచిలి బీపీ కాలనీలో శ్రీకంచమ్మ తల్లి ఐపీఎల్‌ టోర్నమెంట్‌ ప్రారంభించారు. ఈసంద్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ప్రశాంతతకు దోహద పడతాయన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో వి.తిరుమలరావు, ఎస్‌ఐ పారినాయిడు, కూటమి నాయకులు బంగారు కురయ్య, జగదీష్‌ పట్నాయక్‌, టీవీ రమణ, జడ్పీటీసీ మాజీ సభ్యుడు ఇప్పిలి కృష్ణారావు, మద్దిలఆనంద్‌, కురయ్య, రామారావు పాల్గొన్నారు.

వనభోజనం చేసి.. పాత జ్ఞాపకాలు నెమరువేసుకుని

కవిటి, జనవరి17(ఆంధ్రజ్యోతి): కవిటి సముద్రతీరంలో ప్రభుత్వవిప్‌ బి.అశోక్‌ తన మిత్రులు, బ్యాడ్మింటన్‌ క్రీడాకారులతో శుక్రవారం సందడి చేశారు. మిత్రులతో కలిసి సముద్రతీరంలో పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అనంతరం తీరంలో వనభోజనాన్ని చేశారు. కార్యక్రమంలో కాళింగ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ ఎల్‌.రాజేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 17 , 2025 | 11:31 PM