Share News

continuous practice నిరంతర సాధనతోనే గెలుపు

ABN , Publish Date - Jan 12 , 2025 | 11:59 PM

క్రీడల్లో విజయాలు దక్కాలంటే క్రీడాకారులు నిరంతర సాధన చేయాలని ప్రభుత్వ విప్‌ బెందాళం అశోక్‌ అన్నారు.

continuous practice నిరంతర సాధనతోనే గెలుపు
మాట్లాడుతున్న మాజీ మంత్రి శివాజీ

సోంపేట, జనవరి 12(ఆంధ్రజ్యోతి): క్రీడల్లో విజయాలు దక్కాలంటే క్రీడాకారులు నిరంతర సాధన చేయాలని ప్రభుత్వ విప్‌ బెందాళం అశోక్‌ అన్నారు. స్థానిక ప్రభుత్వ గ్రౌండ్‌లో ఎస్‌సీసీ క్రికెట్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్‌రాష్ట్ర డే-నైట్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ను మాజీ మంత్రి గౌతు శివాజీతో కలిసి ఆదివారం రాత్రి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్రీడల్లో జయాపజయాలు సహజమని వాటిని సమానంగా చూడాలన్నారు. క్రీడల వలన మానసిక ఉల్లాసం లభిస్తుందన్నారు. అలాగే పోలీసులు ఏర్పాటు చేసిన డ్రగ్స్‌ వద్దు బ్రో పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఐఎంఏ ప్రతినిధులు ఎస్‌.రాజేంద్రప్రసాద్‌, మంచు ప్రదీప్‌, కూటమి నాయకులు చిత్రాడ శ్రీనివాసరావు, చిత్రాడ శేఖర్‌, దుద్ది శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2025 | 11:59 PM