బురిడి కంచరాంలో బలప్రదర్శన పోటీలు
ABN , First Publish Date - 2025-05-28T23:33:53+05:30 IST
మండలంలోని బురిడి కంచరాంలో 45 అడుగుల అభయాంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ పురస్కరించుకుని బుధవా రం జిల్లా స్థాయి బల ప్రదర్శన పోటీలు నిర్వహించారు.
పొందూరు, మే 28 (ఆంధ్రజ్యోతి): మండలంలోని బురిడి కంచరాంలో 45 అడుగుల అభయాంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ పురస్కరించుకుని బుధవా రం జిల్లా స్థాయి బల ప్రదర్శన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో భాగంగా వెయిట్‌లిఫ్టింగ్, సంగిడీలు, విసురుగుండు, తీత సంగిడి, ఈడుపుసంగిడి క్రీడా పోటీలు ఏర్పాటుచేశారు.