Ganjay గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు చర్యలు
ABN , Publish Date - Feb 21 , 2025 | 11:53 PM
Ganjay గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పోలీసు శాఖ చర్యలు తీసుకుంటోందని ఏఎస్పీ కేవీ రమణ అన్నారు.
ఏఎస్పీ రమణ
21 కిలోలతో నలుగురి అరెస్టు
శ్రీకాకుళం క్రైం, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పోలీసు శాఖ చర్యలు తీసుకుంటోందని ఏఎస్పీ కేవీ రమణ అన్నారు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో గంజాయితో పట్టుబడిన వారి వివరాలను శుక్రవారం విలేకరులకు వివరించారు. రూరల్ మండలం సింగుపురం గ్రామంలో ఉన్న హాటకేశ్వర స్వామి ఆలయం సమీ పంలోని కొండ దిగువన నలుగురు వ్యక్తులు గంజాయిని పంచుకుంటున్నట్టు వచ్చిన సమాచారం మేరకు శ్రీకాకుళం రూరల్ ఎస్‌ఐ కె.రాము తన సిబ్బందితో వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారన్నారు.
పట్టుబడింది పాత నేరస్థులే..
ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. పట్టుబడిన వారిలో దమ్మలవీధికి చెందిన చీకటి యోగేశ్వరరావు అలియాస్ అవతార్, పెద్ద రెల్లివీధికి చెందిన జలగడుగుల తార వికాస్ గతంలో గంజాయి రవాణా కేసుల్లో వన్‌టౌన్ స్టేషన్‌లో పాత నేరస్థులు. అలాగే 12 దొంగతనం కేసుల్లో నిందితులైన పాత్రునివలసకు చెందిన ధర్మాన ప్రవీణ్‌కుమార్, బైౖరివానిపేటకు చెందిన బగ్గు నవీణ్ గంజాయి రవాణా చేసేందుకు సిద్ధమయ్యారు. మిగిలిన వారిపై పోలీసుల నిఘా ఉంటుందని భావించి బగ్గు నవీణ్‌కు తలో రూ.30వేలు చొప్పున రూ.1.20 లక్షలు ఇచ్చి గంజాయి తెచ్చేందుకు పర్లాకిమిడి పంపిం చారు. దీంతో నవీణ్ పర్లాకిమిడిలో ఉన్న తన చెల్లెలి ఇంటికి ఈనెల 17న వెళ్లాడు. అక్కడ ఓ సాధువు దగ్గర కిలో గంజాయి రూ.5 వేలు చొప్పున 21 కిలోలు కొనుగోలు చేసి రెండు రోజులు అక్కడే ఉండి, 20వ తేదీన ఒక గోనె సంచిలో వేసుకుని తెచ్చి సింగుపురం సమీపంలోని హటకేశ్వరస్వామి ఆల యం దగ్గర కొండ దిగువున దాచిపెట్టాడు. ఈ విషయాన్ని మిగిలిన వారికి చెప్పడంతో శుక్రవారం వారంతా అక్కడకు చేరుకుని వాటాలు వేసుకునేం దుకు సిద్ధమయ్యారు. అప్పటికే రూరల్ పోలీసులకు ఈ విషయం సమా చారం ఉండడంతో సీఐ కె.పైడపునాయుడు ఆదేశాల మేరకు ఎస్‌ఐ కె.రాము తన సిబ్బందితో అక్కడికి చేరుకుని వారిని పట్టుకుని, వారి నుంచి 21 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేశారు. అయితే ఈ కేసులో పట్టుబడిన జలగడుగుల తార వికాస్ పాత గంజాయి కేసులో శిక్ష అనుభవించి కొద్ది రోజుల కిందటే బయటకు వచ్చినట్టు ఏఎస్పీ తెలిపారు.
గంజాయితో పట్టుబడితే ప్రత్యేక షీట్
గంజాయితో పట్టుబడితే ప్రత్యేక షీట్‌లు తెరుస్తామని ఏఎస్పీ రమణ స్పష్టం చేశారు. గడిచిన కొన్నేళ్లుగా సరైన చర్యలు లేకపోవడంతో జిల్లాను గంజాయి వనంగా మార్చేశారన్నారు. ఒడిశా రాష్ట్రం జిల్లాకు సరిహద్దు కావ డంతో విచ్చలవిడిగా గంజాయి రవాణా జరుగుతోందని, దీంతో యువత మత్తుకు బానిసలవుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం గంజాయి నియంత్ర ణపై ప్రత్యేక దృష్టి సారించిందని, ఈ నేపథ్యంలో ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా గంజాయి రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. గడి చిన ఆరు నెలల్లో 55 కేసుల్లో 1,725 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నా మని, సుమారు 20 వాహనాలు సీజ్ చేసి 114 మందిని అరెస్టు చేశామ న్నారు. 33 మందిని రీహేబిటేషన్ సెంటర్‌కు పంపించామని వెల్లడించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారి వివరాలు తెలిసిన వారు 100, 112 టోల్‌ఫ్రీ నెంబరుకు తెలపాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచు తామన్నారు. కాగా పాత నిందితులపై నిఘా ఉంచి గంజాయిని పట్టు కోవ డంలో ప్రత్యేక చొరవ చూపిన డీఎస్పీ సీహెచ్ వివేకానంద, సీఐ కె.పైడపు నాయుడు, ఎస్‌ఐ కె.రాము, ఏఎస్‌ఐ ఢిల్లీశ్వరరావు, హెచ్‌సీలు కృష్ణ మూర్తి, ఎస్‌కే సాన్వాజ్, కానిస్టేబుళ్లు వరదరాజులు, వాసుదేవరావు, రాంబా బులను ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.