దశలవారీగా సమస్యలు పరిష్కారం
ABN , Publish Date - Feb 13 , 2025 | 11:34 PM
దశలవారీగా సమస్యలు పరిష్కరిస్తాన ని పలాస ఎమ్మెల్యే గౌతుశిరీష హామీఇచ్చారు. గురువారం పలాస-కాశీబుగ్గ ము నిసిపాలిటీలోని 16వవార్డులో పర్యటించారు. ఈసందర్భంగా ఇక్కడ గాంధీనగర్ కు ఆనుకొని ఉన్న ఓంశాంతి ఆశ్రమం ఎదురుగా రోడ్‌లో, శ్మశానం వాటికకు వెళ్ల డానికి దారి లేదని శిరీషకు వార్డు ప్రజలు వినతిపత్రం అంద జేశారు.

కాశీబుగ్గ, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): దశలవారీగా సమస్యలు పరిష్కరిస్తాన ని పలాస ఎమ్మెల్యే గౌతుశిరీష హామీఇచ్చారు. గురువారం పలాస-కాశీబుగ్గ ము నిసిపాలిటీలోని 16వవార్డులో పర్యటించారు. ఈసందర్భంగా ఇక్కడ గాంధీనగర్ కు ఆనుకొని ఉన్న ఓంశాంతి ఆశ్రమం ఎదురుగా రోడ్‌లో, శ్మశానం వాటికకు వెళ్ల డానికి దారి లేదని శిరీషకు వార్డు ప్రజలు వినతిపత్రం అంద జేశారు. శ్మశాన వాటికకు వెళ్లడానికి రోడ్డు కూడా లేదని వివరించారు. డ్రైనేజీలు, నీటి సమస్య లను ఆమె దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వెంట ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబు రావు, జి.సూర్యనారాయణ, సప్ప నవీన్‌కుమార్, చంద్ర ఉన్నారు.
ఫహరిపురం, ఫిబ్రవరి13 (ఆంధ్రజ్యోతి): కళింగదల్, దామోదరసాగర్, డబా ర్సింగి రిజర్వాయర్లను ఆధునికీకరించాలని ఎమ్మెల్యే గౌతు శిరీష కోరారు. ఈ మేరకు శ్రీకాకుళంలోని ఎస్‌ఈకార్యాలయంలో జలవనరులశాఖ ఎస్‌ఈ వి.కృష్ణా రావును కలిశారు. రిజర్వాయర్లు ఆధునికీకరణతోపాటు నీటి నిల్వ సామర్థ్యం, కాలువలు, మదుములు మరమ్మతులు, సిమ్మెంటు కట్టడాల పునర్నిర్మాణంపై చర్చించారు. ప్రతిపాదనలు సిద్ధం చేస్తే సంబంధిత మంత్రిని కలిసి నిధులు మంజూరయ్యేలా కృషిచేస్తామని ఆమె చెప్పారు. కార్యక్రమంలో పీరుకట్ల విఠల్, ఏఈఈ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఫపలాసరూరల్,ఫిబ్రవరి13(ఆంధ్రజ్యోతి):పలాస ఏపీఎన్‌జీవో హోం నిర్మాణా నికి నిధులు విడుదలచేసి పూర్తి చేయాలని ఈ సంఘ అధ్యక్షులు బోనెల గోపా ల్, కార్యదర్శి బి.ఉపేంద్రరావు, వైస్‌ప్రెసిడెంట్ పి.శ్రీనివాసరావు, ఎస్.పాపారావు కోరారు.ఈ మేరకుపలాసలో ఎమ్మెల్యే శిరీషకు వినతిపత్రం అందజేశారు.