Share News

పనులు వేగవంతం చేయండి

ABN , Publish Date - Feb 03 , 2025 | 11:41 PM

రైల్వే స్టేషన్లల్లో పనులు త్వరగా పూర్తిచేయాలని అధికారులు ఈస్ట్‌ కోస్టు రైల్వే జీఎం పరమేశ్వర్‌ ఫక్వాల్‌ ఆదేశించారు. సోమవారం ఇచ్ఛా పురం, బారువ,సోంపేట రోడ్డు, పలాస రైల్వేస్టేషన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా పలు సంఘాల, రాజకీయపార్టీల నాయకులు రైళ్ల హాల్టింగ్‌, ఆర్వోబీల నిర్మాణంతోపాటు పలుసమస్యలపై వినతిపత్రాలు అందజేశా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైల్వేస్టేషన్లల్లో సమస్యలు పరిష్క రించేందుకు కృషిచేస్తానని హామీఇచ్చారు.

పనులు వేగవంతం చేయండి
పలాస: రైల్వే జీఎం ఫక్వాల్‌కు సమస్యలు వివరిస్తున్న ఎమ్మెల్యే గౌతు శిరీష:

రైల్వే స్టేషన్లల్లో పనులు త్వరగా పూర్తిచేయాలని అధికారులు ఈస్ట్‌ కోస్టు రైల్వే జీఎం పరమేశ్వర్‌ ఫక్వాల్‌ ఆదేశించారు. సోమవారం ఇచ్ఛా పురం, బారువ,సోంపేట రోడ్డు, పలాస రైల్వేస్టేషన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా పలు సంఘాల, రాజకీయపార్టీల నాయకులు రైళ్ల హాల్టింగ్‌, ఆర్వోబీల నిర్మాణంతోపాటు పలుసమస్యలపై వినతిపత్రాలు అందజేశా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైల్వేస్టేషన్లల్లో సమస్యలు పరిష్క రించేందుకు కృషిచేస్తానని హామీఇచ్చారు.

ఫఇచ్ఛాపురం, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): రైల్వేస్టేషన్‌లో అభివృద్ధి పను లు వేగవంతంచేయాలని ఈస్ట్‌కోస్టు రైల్వేజీఎం పరమేశ్వర్‌ ఫక్వాల్‌ కోరా రు. ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న పనులు పరిశీలించారు. అనంతరం రైల్వే క్వార్టర్స్‌లో పార్క్‌ను ప్రారంభించారు. రైలు నిలయంలో సమస్యలను ఎమ్మెల్సీ నర్తు రామారావు, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పిలక రాజలక్ష్మి, జడ్‌ఆర్‌యూసీసీసభ్యుడు శ్రీనివాస్‌రౌళో వినతిపత్రం అందజేశా రు.కార్యక్రమంలో డీఆర్‌ఎం భజానా, చీఫ్‌హెల్త్‌ ఆఫీసర్‌ రవికుమార్‌, స్టేష న్‌ మాస్టార్‌ సాహు, సాయికామేష్‌, ప్రకాష్‌రావు పాల్గొన్నారు.

ఫ సోంపేట, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): బారువ రైల్వేస్టేషన్‌ సమ స్యలు పరిష్కరించాలని కొర్లాం సర్పంచ్‌ రాంబుడ్డి రమణమ్మ, బారువ ఆర్‌ఎస్‌ యూజర్స్‌ కమిటీ ప్రతినిధులు గణపతి, రత్నాల శ్రీనివాసరావు కోరారు.పరమేశ్వర్‌ఫక్వాల్‌, డీఆర్‌ఎం బజ్వాకు వినతిపత్రం అందజేశారు.

ఫ కంచిలి, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): సోంపేట ఆర్‌ఎస్‌ కంచిలి రైల్వే స్టేషన్‌ పరిధిలో గల సమస్యలు పరిష్కరించాలని కంచిలి గ్రామస్థులు కో రారు.ఈమేరకు రైల్వేస్టేషన్‌ను సందర్శించిన జీఎం పరమేశ్వర్‌ ఫక్వా ల్‌ వినతిపత్రం అందజేశారు. సోంపేట స్టేషన్‌లో ప్రధాన పాసిం జర్‌ రైళ్లకు హాల్ట్‌ ఇవ్వాలని శ్రీనివాస్‌రౌళో కోరారు.షెడ్లు నిర్మించాలని జడ్పీటీసీ సభ్యు రాలు ఇప్పిలి లోలాక్షి వినతిపత్రం అందజేశారు.

ఇంజనీరింగ్‌ పనులపై జీఎం అసంతృప్తి

పలాస, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): రైల్వే కాలనీలో సిబ్బంది గృహాలు, కాలువల పనులకు సంబంధించి ఇంజనీరింగ్‌ అధికారులపై జీఎం పరమేశ్వర్‌ ఫక్వాల్‌ అసంతృప్తి వ్యక్తంచేశారు.పలాస రైల్వే స్టేషన్‌లో, రైల్వే కాలనీ, డ్రైవర్లు,గార్డుల రన్నింగ్‌రూమ్‌, ఆర్పీఎఫ్‌ బ్యార క్స్‌లను తనిఖీ చేశారు. సిబ్బంది క్వార్టర్స్‌కు నిధులిస్తు న్నా ఎందుకుపనులు అసంపూర్తిగా ఉన్నాయని ప్ర శ్నించారు. కాలువల నిర్వహణపై మండిపడ్డారు. అ నంతరంస్టేషన్‌లో రన్నింగ్‌రూమ్‌, రోడ్ల నిర్వహణ బా గుందని పేర్కొ ని అధికారులకు రివార్డు ప్రకటించారు. ఆయన వెంట ఖుర్ధారోడ్‌ డీఆర్‌ఎం హెచ్‌ఎస్‌.భజ్వా, అధికారులు ఉన్నారు.

రైలే ్వ ఫ్లైఓవర్‌ను పూర్తి చేయండి: ఎమ్మెల్యే శిరీష

రైల్వే ఫ్లైఓవర్‌ను పూర్తిచేయడానికి నిధులు కేటాయించాలని పలా స ఎమ్మెల్యే గౌతు శిరీష కోరారు. ఈ మేరకు రైల్వే జీఎం పరమేశ్వర్‌ ఫక్వాల్‌కు వినతిపత్రం అందించారు. అమృతభారత్‌లో పలాస ఎంపిక కావడంతో పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టి ప్రయాణికుల సమస్య లు పరిష్కరించాలని కోరారు. ఫ్లాట్‌ఫారం ఒకటిని టిక్కెట్‌ కార్యాల యం మార్గంలో ఏర్పాటుచేయాలని, వృద్ధులు ఫ్లాట్‌ఫారాలపైకి వెళ్లేం దుకు అసౌకర్యానికి గురవుతున్నారని జీఎం దృష్టికి తీసుకువెళ్తారు. స్పందించి బ్యాటరీవాహనాలు ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు.

ఫవజ్రపుకొత్తూరు, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): పూండి రైల్వేస్టేషన్‌లో హౌరా-చెన్నై, విశాఖ- బరంపూర్‌-విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నిలుపుదల చేయాలని అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ పుచ్చఈశ్వరరావు జీఎంకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ఏపీటీపీసీ చైర్మన్‌ వజ్జ బాబూరావు, టీడీపీ నేతలు లొడగల కామేశ్వరరావుయాదవ్‌, పీరుకట్ల విఠల్‌రావు, గురిటి సూర్యనారాయణ, కర్ని రమణ పాల్గొన్నారు. ఫ హరిపురం, ఫిబ్రవరి3 (ఆంధ్రజ్యోతి): మందస రోడ్‌(హరిపురం) రైల్వేస్టేషన్‌ సమస్యలు రైల్వేజీఎం పరమేశ్వర్‌ పక్వాల్‌, డీఆర్‌ఎం హెచ్‌ఎస్‌ భజ్వాల దృష్టికి తీసుకెళ్లినట్లు రైల్వే సమస్యల సాధన కమిటీ సభ్యులు కొర్ల కన్నారావు, కొట్ర ఆనంద్‌, కె.సురేష్‌, వెంకటరావు తెలిపారు. పలాస వచ్చిన రైల్వే అధికారు లను ఎమ్మెల్యే గౌతు శిరీషతో కలిసి వినతిపత్రం అందించా మన్నారు.

Updated Date - Feb 03 , 2025 | 11:41 PM