రెవెన్యూ సమస్యలు పరిష్కరిస్తాం: కలెక్టర్
ABN , Publish Date - Feb 10 , 2025 | 11:59 PM
ఇటీవల జరిగిన రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, రెవెన్యూ సమస్యలు పరిష్కరిస్తామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. సోమవారం బూర్జలో శ్రీకాకు ళం డివిజన్‌లోని 13మండలాల రెవెన్యూసిబ్బందితో సమీక్షించారు.

బూర్జ, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): ఇటీవల జరిగిన రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, రెవెన్యూ సమస్యలు పరిష్కరిస్తామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. సోమవారం బూర్జలో శ్రీకాకు ళం డివిజన్‌లోని 13మండలాల రెవెన్యూసిబ్బందితో సమీక్షించారు. ఈ సం దర్భంగా మాట్లాడుతూ ఇటీవల వివిధగ్రామాల్లో జరిగిన గ్రామసభలు, రెవె న్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. రెవెన్యూ సిబ్బందితో మాట్లాడి సమస్యలకు అడిగితెలుసుకున్నారు. రెవెన్యూ సదస్సుల్లో దరఖా స్తులు ఇవ్వనివారు కూడా వీటికి సంబంధించి సమస్యలుంటే తహసీల్దార్ కార్యాలయం, సచివాలయంలోనూ భూహక్కు సర్వేనెంబర్లతో సహా సరైన ఆధారాలతో దరఖాస్తుచేస్తే వాటిని పరిశీలించి 15 రోజుల్లో సమస్య పరిష్క రిస్తామన్నారు కార్యక్రమంలో జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, ఆర్డీవో ప్రత్యూష రాణి, తహసీల్దార్లు, డీటీలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.