Share News

minister achhenna: ప్రజా సమస్యలు పరిష్కారమే లక్ష్యం

ABN , Publish Date - Feb 16 , 2025 | 12:02 AM

Public Issues ప్రజల సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ, పాడి పరిశ్రమ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శనివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో పలు సమస్యలపై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.

minister achhenna: ప్రజా సమస్యలు పరిష్కారమే లక్ష్యం
మాట్లాడుతున్న మంత్రి అచ్చెన్నాయుడు

  • మంత్రి అచ్చెన్నాయుడు

  • కోటబొమ్మాళి, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): ప్రజల సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ, పాడి పరిశ్రమ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శనివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో పలు సమస్యలపై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. చాలామంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని మంత్రికి వినతులు అందజేశారు. కొంతమంది రైతులు సాగునీటి కోసం విద్యుత్‌ కనెక్షన్లు మంజూరు చేయాలని కోరారు. అలాగే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకులు.. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్‌ వైద్య సేవల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది.. తమకు కనీస వేతం అమలు చేయాలని కోరారు. ప్రతి ఒక్కరి సమస్య పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్న భరోసా ఇచ్చారు. అలాగే నందిగాం మండలం బోరుభద్ర పంచాయతీ కంచివూరులో శ్మశానవాటిక, సీసీరోడ్డు, డ్రైనేజీలు నిర్మించడంతో గ్రామస్థులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు కలమట వెంకటరమణ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Feb 16 , 2025 | 12:02 AM