Share News

Technology: సాంకేతికతతో సమస్యల పరిష్కారం

ABN , Publish Date - Feb 26 , 2025 | 12:10 AM

problem-solving ప్రజా సమస్యల పరిష్కారానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌తో కలిసి అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

Technology: సాంకేతికతతో సమస్యల పరిష్కారం
మాట్లాడుతున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

  • పీఎం సూర్యఘర్‌ను మిషన్‌ మోడ్‌లో చేపట్టాలి

  • కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

  • శ్రీకాకుళం కలెక్టరేట్‌, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌తో కలిసి అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ, ఉపాధిహామీ, ప్రధానమంత్రి సూర్యఘర్‌ యోజన, ఐసీడీఎస్‌, జీఎస్‌డబ్ల్యూఎస్‌, పారిశుద్ధ్యం, వైద్యారోగ్యం, పీజీఆర్‌ఎస్‌ వంటి అంశాలపై చర్చించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక.. ‘మీ-కోసం’ ద్వారా వచ్చిన ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించాలి. పరిష్కరించబడిన ఫిర్యాదులపై ఆడిటింగ్‌ నిర్వహించాలి. ఏపీ సేవ, మీసేవా, పీజీఆర్‌ఎస్‌ దరఖాస్తుల స్థితిగతులపై ఎప్పటికప్పుడు సమీక్ష చేపట్టాం. ప్రజలకు మెరుగైన సేవలందించడానికి సాంకేతికతను వినియోగించుకోవాలి. జిల్లాలో ప్రధానమంత్రి సూర్యఘర్‌ యోజనను మిషన్‌ మోడ్‌లో నిర్వహించాల’ని ఆదేశించారు. అలాగే రెవెన్యూ సదస్సులు, రీసర్వే, ఫిర్యాదుల పరిష్కారానికి అనుసరిస్తున్న విధానాలపై చర్చించారు. ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ విశ్లేషణ, ఇళ్లస్థలాల రీ-వెరిఫికేషన్‌, అభ్యంతరం లేని ఆక్రమణల క్రమబద్ధీకరణ, ల్యాండ్‌ బ్యాంక్‌ కేసులు, కోర్టు కేసులు, లోకాయుక్త కేసులు, ఎస్సీ, ఎస్టీ కేసుల పరిష్కారంపై మాట్లాడారు. ఉపాధిహామీ పథకం కింద మెటీరియల్‌ కాంపోనెంట్‌ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. గ్రామ సచివాలయాలకు సంబంధించి గత సమావేశంలో చర్చించిన హాజరు, ఇతర సర్వేలపై ఆరా తీశారు. అలాగే చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ముఖ్య ప్రణాళికా అధికారి కార్యాలయ పరిధిలో ముఖ్యమంత్రి హామీలు, జిల్లాలో అభివృద్ధి పనుల పురోగతిపై చర్చించారు. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ఉప కలెక్టర్‌ పద్మావతి, జడ్పీ సీఈవో శ్రీధర్‌ రాజా, సీపీవో ప్రసన్నలక్ష్మి, డీపీవో భారతి సౌజన్య, వ్యవసాయాధికారి త్రినాథస్వామి, డీఆర్డీఏ పీడీ కిరణ్‌కుమార్‌, హౌసింగ్‌ పీడీ నగేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 26 , 2025 | 12:10 AM