Share News

కార్మికుల సమస్యలు పరిష్కరించండి

ABN , Publish Date - Feb 24 , 2025 | 11:51 PM

: కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మునిసిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షుడు టి.తిరు పతిరావు, అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు కె.వేణుగోపాల్‌, అప్పలరాజు కోరారు.

 కార్మికుల సమస్యలు పరిష్కరించండి
నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్న కార్మికులు :

శ్రీకాకుళం అర్బన్‌, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మునిసిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షుడు టి.తిరు పతిరావు, అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు కె.వేణుగోపాల్‌, అప్పలరాజు కోరారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా నిర్వ హించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ అబ్కాస్‌, ఔట్‌సోర్సింగ్‌, పారిశుధ్య ఇంజనీరింగ్‌, ఎన్‌ఎంఆర్‌ ఉద్యోగ కార్మికులను పర్మినెంట్‌ చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘ నాయకులు రామారావు, గురుమూర్తి, పార్ధసారధి, కూ ర్మారావు, గణేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 24 , 2025 | 11:51 PM