Share News

మహిళా సాధికారతతోనే సమాజ అభ్యున్నతి

ABN , Publish Date - Mar 08 , 2025 | 12:33 AM

మహిళా సాధికారతతోనే సమాజం అభ్యున్నతి సాధిస్తుందని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు.

మహిళా సాధికారతతోనే సమాజ అభ్యున్నతి
మహిళా పోలీసులతో ఎస్పీ మహేశ్వరరెడ్డి

శ్రీకాకుళం క్రైం, మార్చి 7(ఆంధ్రజ్యోతి): మహిళా సాధికారతతోనే సమాజం అభ్యున్నతి సాధిస్తుందని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పుర స్కరించుకుని పోలీసు శాఖ ఆధ్వర్యంలో వన్‌టౌన్‌, టూటౌన్‌, రూరల్‌ స్టేషన్ల పరిధిలో ఉన్న మహిళ పోలీసుల అభినందన కార్యక్రమం శుక్రవారం నగరంలోని ఓ కల్యాణ మండపంలో జరిగింది. ముఖ్యఅతిఽథిగా పాల్గొన్న ఎస్పీ మాట్లాడుతూ.. మహిళ సాధికారతకు పోలీసు శాఖ అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలపై 100, 112, చైల్డ్‌లైన్‌ 1098, సైబర్‌ 1930 టోల్‌ఫ్రీ నెంబర్ల సమాచారం ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో మహిళ పోలీసులు సందడి చేశారు. వీరందరికి ఎస్పీ జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ కేవీ రమణ, డీఎస్పీ సీహెచ్‌ వివేకా నంద, సీఐలు పైడపునాయుడు, ఈశ్వరరావు, నాగరాజు, త్రినేత్రి, ఎస్‌ఐ హరికృష్ణ, జనార్దన రావు, రాము, లక్ష్మి, చంద్రకళ, మహిళ పోలీసులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 08 , 2025 | 12:33 AM