Share News

Singer Sunitha ఆదిత్యుని సన్నిధిలో సినీగాయని సునీత

ABN , Publish Date - Feb 17 , 2025 | 12:07 AM

ఆరోగ్యప్రదాత అరసవల్లి సూర్యనారాయణ స్వామివారిని ప్రముఖ సినీ నేపథ్య గాయని సునీత ఆదివారం దర్శించుకున్నారు.

Singer Sunitha  ఆదిత్యుని సన్నిధిలో సినీగాయని సునీత
గాయని సునీతకు జ్ఞాపికను అందిస్తున్న ఈవో భద్రాజీ

అరసవల్లి, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): ఆరోగ్యప్రదాత అరసవల్లి సూర్యనారాయణ స్వామివారిని ప్రముఖ సినీ నేపథ్య గాయని సునీత ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆమెకు స్వాగతం పలుకగా, అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. స్వామివారి జ్ఞాపికను ఆలయ ఈవో భద్రాజీ వారికి అందజేశారు. కార్యక్రమంలో అర్చకులు ఇప్పిలి సాందీపశర్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 17 , 2025 | 12:07 AM