Share News

Srishaila Mallanna శ్రీశైల మల్లన్నకు ‘సిక్కోలు తలపాగా’

ABN , Publish Date - Feb 24 , 2025 | 12:45 AM

మహాశివరా త్రి వస్తోందంటే చాలు గుజరా తీపేటలో ఉన్న దేవాంగులవీధి లో ఒకటే సందడి.

Srishaila Mallanna  శ్రీశైల మల్లన్నకు ‘సిక్కోలు తలపాగా’
తలపాగాను ఊరేగింపుగా తీసుకువెళ్తున్న దృశ్యం

శ్రీకాకుళం కల్చరల్‌, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): మహాశివరా త్రి వస్తోందంటే చాలు గుజరా తీపేటలో ఉన్న దేవాంగులవీధి లో ఒకటే సందడి. 75 ఏళ్లగా దాదాపు ఒకటిన్నర నెలల ముం దే అక్కడికి చేనేత కార్మికులం దరూ మిగతా అన్ని కార్యక్రమా లు పక్కనపెట్టేసి శ్రీశైల మల్ల న్నకు సమర్పించేందుకు ప్రత్యేక కిరీట ధారణగా ఒ క వస్ర్తాన్ని తయారు చేస్తారు. నేత పని పూర్తయిన తర్వాత ప్రత్యేక పూజలు, ఊరేగింపు నిర్వహించి శ్రీశైలానికి తీసుకువెళతారు. ఈ ఏడాది కూడా తల పాగా వస్త్రాలు పంపించేందుకు చేనేత కార్మికులు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా 365 మూరలు ఉన్న స్వామివారి తలపాగను ఆదివారం సందడిగా ఊరేగింపు చేపట్టారు. 45 రోజులు 11 మంది శివ మాలధారణ చేసి తలపాగను స్వామి వారి చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో టీవీ రాజు, బళ్ల తిరుమలరావు, బుచ్చిబాబు, దివ్యకుమా ర్‌, ఊరేగింపుగా ఇంటింటికి వెళ్లి అందరికీ దర్శనం చేయించారు. ఊరేగింపులో తప్పెటగుళ్లు, కోలాటం, మేలతాళాలు, బాజా భజంత్రీలతో ఊరేగింపు నిర్వ హించారు. అనంతరంతో తలపాగా తీసుకుని పలు వురు భక్తులు శ్రీశైలం బయలుదేరి వెళ్లారు.

Updated Date - Feb 24 , 2025 | 12:45 AM