కళలతో సృజనాత్మకతకు పదును
ABN , Publish Date - Feb 08 , 2025 | 11:46 PM
మనలోని సృజనాత్మ కతకు పదును పెట్టేవి కళలేనని వక్తలు అన్నారు. పట్టణంలోని పాలపోలమ్మ గుడి ఆవరణలో ఉభయ రాష్ర్టాల నాటిక పోటీలు కొనసాగుతున్నాయి.

ఆమదాలవలస, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): మనలోని సృజనాత్మ కతకు పదును పెట్టేవి కళలేనని వక్తలు అన్నారు. పట్టణంలోని పాలపోలమ్మ గుడి ఆవరణలో ఉభయ రాష్ర్టాల నాటిక పోటీలు కొనసాగుతున్నాయి. రెండో రోజు శనివారం సీనియర్ రంగస్థల కళాకారుడు, పద్మశ్రీ ఎడ్ల గోపాలరావును కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు తమ్మినేని విద్యాసాగర్, పేడాడ ప్రతాప్ సత్క రించారు. కార్యక్రమంలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వ ప్రసాద్, బీజేపీ కన్వీనర్ పేడాడ సూరప్పనాయుడు, డీసీసీ మాజీ అధ్యక్షుడు పేడాడ పరమేశ్వరరావు, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ తమ్మినేని గీత, జనసేన జిల్లా ఉపాధ్యక్షుడు పాత్రుని పాపారావు, కాంగ్రెస్ ఇన్‌చార్జి సనపల అన్నాజీరావు, వైద్యులు దానేటి శ్రీధర్, బొడ్డేపల్లి సురేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం హైదరాబాద్‌కు చెందిన కళాకారులు ప్రదర్శించిన ‘స్వేచ్ఛ’ నాటిక అలరించింది.