revenue రెవెన్యూ సదస్సులతో భూ సమస్యలకు పరిష్కారం
ABN , Publish Date - Jan 04 , 2025 | 11:59 PM
గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులతో రైతులు ఎదుర్కొంటు న్న భూ సమస్యలను పరిష్కరిం చుకోవచ్చునని ఎమ్మెల్యే కూన రవి కుమార్ అన్నారు.

బూర్జ, జనవరి 4(ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులతో రైతులు ఎదుర్కొంటు న్న భూ సమస్యలను పరిష్కరిం చుకోవచ్చునని ఎమ్మెల్యే కూన రవి కుమార్ అన్నారు. శనివారం తోట వాడ పంచాయతీలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్, ఏపీ మార్క్‌ఫెడ్ డైరెక్టర్ ఆనెపు రామకృష్ణంనాయుడు, తహశీల్దార్ పద్మావతి, కూటమి నాయకులు పాల్గొన్నారు.