Settlement మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారం
ABN , Publish Date - Jan 17 , 2025 | 11:34 PM
Settlement మధ్య వర్తిత్వం ద్వారా ఇరు పక్షాల సమ్మతితో కేసులను పరిష్కరిం చుకోవచ్చని సివిల్ కోర్డు జూనియర్ సివిల్ న్యాయాధికారి బీఎంఆర్ ప్రసన్న లత అన్నారు.

కోటబొమ్మాళి, జనవరి 17 (ఆంధ్ర జ్యోతి): మధ్య వర్తిత్వం ద్వారా ఇరు పక్షాల సమ్మతితో కేసులను పరిష్కరిం చుకోవచ్చని సివిల్ కోర్డు జూనియర్ సివిల్ న్యాయాధికారి బీఎంఆర్ ప్రసన్న లత అన్నారు. శుక్రవారం కోర్టు ఆవ రణలో న్యాయవాదులు, కక్షిదారు లతో మధ్యవర్తిత్వంపై అవగాహన సదస్సు నిర్వ హించారు. మధ్యవర్తిత్వం, దాని ఉపయోగాన్ని వివరించారు. కార్యక్ర మంలో ఇన్‌చార్జి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శాంతి సంతోషి, ఏజీపీ ఎస్. తిరుమలరావు, న్యాయ వాదులు లఖినేని శ్రీనివాస్, బి.నారాయణరావు, కవి టి మన్మఽథరావు, పూజారి వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు.